Advertisement
సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఉంటారు..ఈ తరుణంలోనే హీరోలు కూడా వారి రెమ్యూనరేషన్ చాలా పెంచేశారు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే చాలా లాభాలు వస్తాయని అనుకుంటారు. ఆ విధంగా కొన్ని సినిమాలకు భారీగా బడ్జెట్ కూడా పెడతారు. కానీ అనుకోకుండా సినిమాలు డిజాస్టర్ గా నిలిచిపోతాయి..
Advertisement
దీనికి ప్రధాన కారణం బడ్జెట్ ఎక్కువ పెట్టడం, ఎక్కువ రేటుకు అమ్మడం, కలెక్షన్లు రాకపోవడంతో ఆ సినిమాలు నష్టాలను మిగులుస్తాయి. అయితే ఇప్పటి వరకు భారీ డిజాస్టర్ టాక్ తో 90 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన గణత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే ఉంది.. మరి ఆ సినిమాలు ఏంటో చూద్దాం..
ALSO READ;2022 లో తెలుగులో మంచి కలెక్షన్లు సాధించిన 10 డబ్బింగ్ సినిమాలు ఇవే..!
గోపాల గోపాల మూవీ డైరెక్టర్ డాలి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాటమరాయుడు.ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చి బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇది తమిళ హిట్ సినిమా వీరం మూవీ కి రీమేక్.. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ సినిమా వీడొక్కడే అనే పేరుతో తెలుగులో డబ్ అయింది. అయితే ఇదే మూవీ ని పవన్ తెలుగు లో మార్పులు చేర్పులు చేయడంతో కాటమరాయుడు గా వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శృతి హసన్ నటించగా, సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న అంచనాలు అందుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. కానీ బాక్సాఫీసు వద్ద 90 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు మొదటి రోజే 50 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం.
Advertisement
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. బండ్ల గణేష్ నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే ఇదే సినిమాకు సీక్వెల్ గా బాబీ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా సర్దార్ గబ్బర్‌సింగ్ తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేక పోయినా 90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.
దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేస్తుందని అందరూ భావించారు.కానీ అనూహ్యంగా మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ సినిమా మాత్రం 95 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో పవన్ సినిమాలకు మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చిన దాదాపుగా 90 నుంచి 100 కోట్ల గ్రాస్ రావడం విచిత్రం.. ఇక మిగతా సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టినా ఫ్లాప్ అయితే మాత్రం వారు పెట్టిన దానికి కనీసం సగం కూడా రావడం లేదని సమాచారం.
ALSO READ;సీరియల్స్ లో నటించి.. సినిమాల్లోకి వచ్చిన స్టార్లు వీళ్లే ?