Advertisement
Ponniyin Selvan PS1 Movie Review in Telugu: తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం పోన్నియన్ సెల్వన్-1. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పోన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు. కాగా మొదటి భాగం ఇవాళ విడుదల అయింది. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబి సింహ వంటి స్టార్లు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. అయితే, సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Ponniyin Selvan PS1 Movie Story: కథ మరియు వివరణ:
ఈ సినిమా, 10వ శతాబ్దం కు చెందినది. అప్పట్లో చోళరాజుల చరిత్రను చెబుతుంది. ఆదిత్య కరికాలన్ (విక్రమ్), నందిని (ఐశ్వర్యారాయ్), కుందవై పిరిత్తియార్ (త్రిష) పాత్రలో కనిపించారు. పరాంతక చోళుడుకు ఆదిత్య కరికాలన్ అరుల్ మొలి వర్మన్ అనే ముగ్గురు సంతానంగా చూపించారు. అయితే అదిత రాజు బంగారు భవనాన్ని నిర్మిస్తాడు. తండ్రిని బంగారు భవనంలో ఉండాల్సిందిగా కోరుతాడు. మిత్రుడు అయిన వందియతేవన్ సాయంతో కబురు పంపుతాడు. అయితే వెళ్లే దారిలో వందియతేవన్ కదంపూర్ భవనంలో కాసేపు బస చేస్తాడు. అక్కడే చోళరాజ కోశాధికారి పలువెట్టయ్య కరికాలపై చేసిన కుట్ర గురించి తెలుస్తుంది. ఆపై ఉత్తరాన్ని పరాంతక చోళుడికి చేరుస్తాడు. తమ్ముడు అరుల్ కూడా తీసుకొని రావాల్సిందిగా కుందవై వందియతేవన్ శ్రీలంకకు పంపిస్తాడు.
Advertisement
అరుల్ మొలివర్మన్ ను బందీగా చేయాలని పలువెట్టరైయార్ శ్రీలంకకు రెండు ఓడలను పంపిస్తాడు. అరుల్ తీసుకొని వస్తున్న సమయంలో సముద్రంలో తుఫానులో ఓడలు చిక్కుకుంటాయి. అప్పుడే ఒక జాలరి వారిని కాపాడుతుంది. అరుల్ గాయపడతాడు. దాంతో అతడికి చికిత్స అందించేందుకు బౌద్ధ మందిరానికి తీసుకెళ్తారు. పినతండ్రి మధురాంతకన్ ను గద్దె ఎక్కించేందుకు పలువెట్టయర్ కుట్రలు పన్నుతుంటాడు. పథకం ప్రకారమే, కదంబూర్ లోని భవనంలోకి ఆదిత్య కరికలన్ ను రప్పించి హత్య చేస్తారు. ఈ హత్య నేరం వందియతేవన్ పై పడేలా చేస్తారు. ఆ తర్వాత వందియతేవన్ ఎలా ఆ సమస్య నుంచి బయటపడతాడు, ఇంతకీ పలువెట్టయార్ ఏమయ్యాడు? వందియతేవన్, కుందవై మధ్య లవ్ ట్రాక్ ఏంటి అనేది తెలియాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే.
పొన్నియన్ సెల్వన్-1 మూవీ రివ్యూ: ప్లస్ పాయింట్స్
అద్భుతమైన సన్నివేశాలు
నటీనటుల నటన
సంగీతం
యాక్షన్ సన్నివేశాలు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
సీన్లు సాగదీత
రేటింగ్: 3/5
Read also : జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా ?