Advertisement
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి సెప్టెంబర్ 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Advertisement
అయితే తల్లి చనిపోయిన తర్వాత తల్లి చివరి కోరికను నెరవేర్చలేకపోయానని మహేష్ బాబు చాలా బాధపడుతున్నారని సమాచారం అందుతోంది. సితార ఓణీల ఫంక్షన్ చూడాలని ఇందిరా దేవి మహేష్ ను కోరారని సమాచారం. అయితే మహేష్ వర్క్ విషయంలో బిజీగా ఉండటంతో అమ్మ మాటను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇందిరాదేవి బ్రతికి ఉన్న సమయంలోనే ఈ వేడుకను జరిపించి ఉంటే బాగుండేదని, మహేష్ ప్రస్తుతం ఫీలవుతున్నారని బోగట్ట.
Advertisement
ఇందిరాదేవి, సితార ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారని, నానమ్మకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సితార చూసుకునే వారని సమాచారం. మహేష్ కెరిర్ లో ఈ స్థాయిలో సక్సెస్ సాధించడానికి ఇంద్రాదేవి కూడా ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం వల్లే మహేష్ సర్కార్ వారి పాట సినిమా రిలీజ్ అయిన తర్వాత తల్లి పక్కన ఉంటూ ఆమె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. మహేష్ బాబు తల్లి మరణం తర్వాత ఎక్కువ సమయం ఒంటరిగా ఉంటున్నారని భోగట్ట. మహేష్ తాత్కాలికంగా త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ను సైతం పోస్ట్ ఫోన్ చేశారని తెలుస్తోంది.
Read also : విక్రమ్ నుంచి శోభిత వరకు పొన్నియన్ సెల్వన్-1 మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా ?