Advertisement
గ్లామర్ ఫీల్డ్ లో ఆర్టిస్టుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తుంటాయన్న విషయం తెలిసిందే. కానీ, వాటిలో కొన్ని జంటలు మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి. అలా చాలామంది కాలం పాటు ప్రేమించుకొని అగ్నిసాక్షిగా ఒక్కటైన జోడిల్లో దీపికా పదుకొనే, రన్వీర్ సింగ్ జంట ఒకటి. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ స్టార్లుగా వెలుగొందుతున్న ఈ ఇద్దరు, కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతున్నారు.
Advertisement
ఈ క్రమంలో తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అని. దీని గురించి ఇప్పటికే ఉమైర్ సందు అనే ఫిల్మ్ క్రిటిక్, దీపిక-రణవీర్ ల మధ్య అంత సవ్యంగా లేదని ట్వీట్ చేశాడు. దాంతో ఒక్కసారి అందరి అటెన్షన్ వీరి మీదకు మళ్ళింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, మరీ ముఖ్యంగా రన్వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ వల్లే వీరి మధ్య విభేదాలు వచ్చాయంటూ బిటౌన్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి విడాకుల వార్తలు జోరుగా ప్రచారం అవుతుండడంతో, ఈ జంట ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై దీపిక ఇప్పటివరకు స్పందించలేదు. కానీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రన్వీర్ తమ విడాకుల రూమర్స్ పై స్పందించాడు.
Advertisement
‘దీపికాతో నాకు 2012లో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ఎన్నో ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఈ పదేళ్లలో తనపైన ప్రేమ ఇంకా పెరిగింది. దీపిక నా లైఫ్ లోకి వచ్చాక నా జీవితం ఇంకా అందంగా మారింది. మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు’ అని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం దీపిక తన తల్లి ఉజ్జల పదుకొనే తో కలిసి ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా, దీనిలో దీపికా చేతికి వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు. అది గమనించిన నేటిజెన్లు “హో, దీపికా తన చేతికి వెడ్డింగ్ రింగ్ తీసేసింది, అంటే వీరి విడాకుల వార్తలు నిజమేనా”? అని అనుమానాలు వ్యక్తం చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు.
READ ALSO : ఎంతటి ప్రాణ స్నేహితులైనా ఈ 5 విషయాలు అస్సలు చెప్పకండి… చెబితే మీ లైఫ్ ప్రమాదంలో పడినట్లే !