Advertisement
Godfather Telugu Movie Review : మెగాస్టార్ తాజాగా నటించిన సినిమా గాడ్ ఫాదర్. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కింది. అయితే చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ గాడ్ ఫాదర్ సినిమాను తెలుగుతో సహా హిందీ ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Godfather Telugu Movie Story: కథ మరియు వివరణ
గాడ్ ఫాదర్ సినిమా రాజకీయమే ముఖ్య అంశంగా తెరకెక్కింది. ఒక కథ విషయంలోకి వెళితే ఏపీ లోని అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మరణిస్తాడు. ఆ పదవిలో ఉన్న సీఎం చనిపోవడంతో ఆ తర్వాత సీఎం పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే చర్చలు చేస్తారు. ఇంకా సీఎం కూతురు గా నయనతార కు ఆ అవకాశం ఉంటుంది. కానీ ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి అసలు ఉండదు. దీంతో నయనతార రెండో భర్తకు ఆ చాన్స్ ఉంటుంది. ఆమె రెండో భర్త పెద్ద క్రిమినల్ అతడే మెయిన్ విలన్. కానీ అతడు నయనతారకు తెలియకుండా అన్ని తతంగాలు నడిపిస్తాడు. ఇక సీఎం కొడుకు కు కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సీఎంకు మరో దగ్గర వ్యక్తి అయిన గాడ్ ఫాదర్ ఆ ఛాన్స్ ఉంటుంది. అప్పటికే చిరంజీవి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటాడు. అయితే సీఎం చనిపోవడంతో చిరంజీవి ఆఖరి చూపు కోసం వస్తుంటాడు. అయితే ఆ సీఎం పోస్టులో ఎవరు కూర్చుంటారు. నయనతార భర్తను గాడ్ ఫాదర్ ఇలా అంతం చేస్తారనేదే ఈ సినిమా స్టోరీ.
Advertisement
Godfather Telugu Movie Review
ఇక నటీనటుల యాక్టింగ్ విషయానికి… మెగాస్టార్ చిరంజీవి గతంలో అద్భుతమైన నటుడే అయినా కొత్త సినిమాలతో కష్టాలు పడి తెరపై తనను తాను అనుకరించే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు స్క్రీన్పై డైలాగులను అందించే విధానానికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి నటన ఓ రేంజ్ లో ఉంటుంది. చిరంజీవి చెప్పే డైలాగులు కూడా అందరిని ఆకట్టుకుంటాయి. నయనతార ఎప్పటిలాగే అద్భుతంగా నటించింది. ఎమోషనల్ పాత్రలో నయనతార.. తన మార్కు ప్రదర్శన స్పష్టంగా కనిపించింది. అటు సల్మాన్ ఖాన్ పాత్ర ఇందులో ఏ మాత్రం పనిచేయలేదు. సత్యదేవ్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. తమన్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ప్లస్ పాయింట్స్ :
సత్యదేవ్ మరియు నయనతార యాక్టింగ్
రాజకీయ సన్నివేశాలు
పోరాటాలు
మైనస్ పాయింట్లు
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
సంగీతం
సీన్స్ మిస్సింగ్
సినిమా రేటింగ్ 2.75/5
READ ALSO : మణిరత్నం “పొన్నియన్ సెల్వన్” చూసాక మీకు ఇదే డౌట్ వచ్చిందా ? ఇది నిజమే నా అస్సలు నమ్మలేరు !