Advertisement
జూనియర్ ఎన్టీఆర్ & మంచు మనోజ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ & మంచు మనోజ్ లు ఇద్దరు కూడా బలమైన సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసులే. టాలీవుడ్ లో బలమైన పిల్లర్ అయిన నందమూరి వంశంలో మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాతను పోలిన రూపంతో పాటు తాత లాగానే చిన్న వయస్సు నుంచే పౌరాణికం, సాంఘికంతో పాటు ఫ్యాక్షనిజం ఇలా ఏ పాత్రలో అయినా వదిలిపోయే నైజం ఎన్టీఆర్ సొంతం. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మరియు మంచు మనోజ్ ల మధ్య కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. యాదృచ్చికమే అయినా సేమ్ టు సేమ్ ఉన్న ఆ ఐదు పోలికలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
#1 బర్త్ డే ఒక్క రోజే
జూనియర్ ఎన్టీఆర్ & మంచు మనోజ్ లు ఇద్దరు 1983 మే 20న జన్మించారు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని గంటల ముందు జన్మించారు.
Advertisement
#2 ఇద్దరూ బాలనటులుగా ఎంట్రీ ఇచ్చింది రామారావు సినిమాల్లోనే
జూనియర్ ఎన్టీఆర్: ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ద్వారా బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
మంచు మనోజ్: రామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
#3 ఇద్దరి తల్లిదండ్రులు MP లే
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు ఇద్దరూ MP లుగా రాజ్యసభలో అడుగుపెట్టిన వారే.
#4 ఇద్దరి భార్యల పేర్లు ప్రణతినే
జూనియర్ ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మీ ప్రణతి కాగా, మంచు మనోజ్ భార్య పేరు ప్రణతి. కానీ ఇటీవలే మనోజ్ , ప్రణతి విడాకులు తీసుకున్నారు.
#5 రెండవ భార్య సంతానం
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రెండో భార్య సంతానం కాగా, మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు కూడా రెండో భార్య సంతానం.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?