Advertisement
కంటికి కాస్తంత నదురుగా కనిపిస్తే చాలు ప్రేమించేస్తారు. చిన్న పొరపాటు జరిగిందంటే చాలు.. కత్తులతో నరికేస్తారు. ప్రిజ్ లో పెట్టేస్తారు. ఇది ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న ప్రేమ. ప్రేమ అంటే ఎలా ఉంటుందో..ఎలా ఉండాలో తన కుంచెతో గీసి చూపించాడు ఒక ఆర్టిస్ట్. ఇంతకి ఏమిటి ఆ ప్రేమ కథ. తెలుసుకుందాం.
Advertisement
అతని పేరు ప్రద్యుమ్న కుమార్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ పెయింటింగ్ నేర్చుకుంటున్న ఒక నిరుపేద విద్యార్థి. చిత్రలేఖనం అంటే ఆ యువకుడికి కుంచెతో పెట్టిన విద్య. కళలు ఉట్టిపడే చిత్రాలను గీయడంలో ఆయనకు ఆయనే సాటి అన్న పేరు తెచ్చుకున్న ఓ కళాకారుడు. ఈయన ప్రతిభ పాఠవాలు అలా ఖండాంతరాలు దాటాయి. ఆయన గీసిన చిత్రాలు స్వీడన్ కి చెందిన షార్లెట్ శ్వాన్ సెట్విన్ అనే ఓ యువతిని ఆకట్టుకున్నాయి. ఇండియాకి వెళ్లి ప్రద్యుమ్న చేత పేయింటింగ్ వేయించుకోవాలని షార్లెట్ డిసైడ్ అయింది. అప్పటికీ ఆమె వయస్సు 19 ఏళ్లు. స్వీడన్ నుంచి కదిలిన ఈ టీనేజ్ బ్యూటీ పుల్ ప్రద్యుమ్న అడ్రస్ పట్టుకొని అతని దగ్గరికి వచ్చింది. షార్లెట్ వాన్ చిత్రాన్ని గీసేందుకు అతన్ని ఒప్పించింది. అక్కడే వీరి ప్రేమ చరిత్రకు తొలి అడుగు పడింది. రెండు రోజుల్లోనే షార్లెట్ రూపం ఆవిష్కృతg అయింది. ఆమె రూపాన్ని తన కంటే అందంగా ప్రదర్శించిన ప్రజుంన ప్రతిభకు ఆ స్వీడన్ యువతి ఫిదా అయింది. ఆమె మనస్సు తన కోసమే పుట్టిన చెలికాడు తనకు ఇంత దూరంగా ఉన్నాడన్న ఏదో తెలియని అనుభూతి ఆమె గుండెల్లో గిలిగింతలు పెట్టింది.
ప్రద్యుమ్న జీవితంలో అర్థభాగం కావడమే తన జీవితానికి సార్థకథ అని డిసైడ్ అయింది. అటు ఆమె రూపాన్ని తదేకంగా చూస్తూ.. చిత్ర రచన చేస్తున్న సమయంలో కళాకారుడి మదిలో కూడా ఇదే. మనస్సులోని భావాలు పెదవి దాటి బయటికీ వచ్చాయి. వారిద్దరూ ఒకటి కావడానికి ప్రజుంన తల్లిదండ్రులు ఓకే అన్నారు. గిరిజన సాంప్రదాయంలో వారి పెళ్లి జరిగింది. విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చిన షార్లెట్ తిరిగి స్వీడన్ వెళ్లింది. తనతో కలిసి తమ దేశానికి రావాల్సిందిగా ఆ ఆర్టిస్ట్ కి ఆమె రిక్వెస్ట్ చేసింది. తన చదువు పూర్తి అయిన వెంటనే వచ్చేస్తానంటూ ప్రజుంనా మాటిచ్చారు. మనస్సును ఇక్కడే ఉంచి షార్లెట్ తనువు మాత్రమే స్వీడన్ కి వెళ్లిపోయింది. ఉత్తరాలతోనే వారి అనుబంధం ఏడాది పాటు కొనసాగింది. ప్రజుంన కోర్సు పూర్తి అయింది. భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ఢిల్లీ నుంచి స్వీడన్ కి వెళ్లాలి. చేతిలో టికెట్ కి కావాల్సిన సొమ్ము లేదు. ఎవరి వద్దనైనా అప్పు తీసుకునేంత పరపతి లేదు. అయితే ఎలాగైనా తన భార్యను చేరుకోవాలన్న ఉక్కు సంకల్పం గుండెల నిండ ఉంది.తన దగ్గర ఉన్న సొమ్ముతో ఆ కళాకారుడు ఒక సైకిల్ కొనగలిగాడు. ఆ సైకిల్ మీదనే ముందుకు కదిలాడు. రోజుకు 70 కిలోమీటర్ల మేర నఆపడం.. చిత్రాలు అక్కడికక్కడే గీయడం.. వాటిని అమ్మి కడుపునింపుకోవడం.. ఆకలి తీరిన వెంటనే మళ్లీ ప్రేమ ప్రయాణం మొదలు పెట్టడం ఇలా జనవరి 22న మొదలైన ఆ ప్రయాణం పాకిస్తాన్, అప్గానిస్తాన్, ఇరాన్, టర్కీ ల మీదుగా నాలుగు నెలల పాటు నిర్వీరామంగా సాగింది.
Advertisement
మధ్య మధ్యలో సైకిల్ రిపెయిర్లు, ప్రయాణానికి అనుకూలించని వాతావరణ పరిస్థితులు ఇవేమి ఆ ప్రేమ సంకల్పానికి అవరోధాలు కాలేకపోయాయి. మే 28న యూరప్ కి చేరుకున్నాడు. యూరప్ నుంచి ఇస్తాంబుల్, వియన్నా మీదుగా ప్రయాణించి పూర్తిగా పనికి రాకుండా పోయిన సైకిల్ ని రైలులో పెట్టుకొని చిట్టచివరిగా తన భార్య షార్లెట్ స్వీడన్ లోని బోరస్ గడ్డ మీద అడుగుపెట్టాడు. అడ్రస్ పట్టుకొని జీవిత భాగస్వామి చెంతకు చేరుకున్నాడు. అంతులేని కష్టాలు పడి తన చెంతకు చేరుకున్న తన భర్తను షార్లెట్ పొంగిపోయింది. స్వీడన్ లో వారికి అక్కడి సంప్రదాయం ప్రకారం.. మళ్లీ పెళ్లి జరిగింది. ఈ అనిర్వచనీయంగా ఆ జంటకు ఇద్దరూ బిడ్డలు పుట్టారు. పువ్వుల్లా పరిమళించారు. స్వీడన్ లో ఉన్న భార్యకు ఇండియాలో ఉన్న భర్తకు ఉత్తరాలు ఏంటి వారికి సెల్ ఫోన్లు లేవా అనుకోవచ్చు. ఈ ప్రేమ ప్రయాణం జరిగి ఇప్పటికీ 50 ఏళ్లు గడిచింది. ఈ అద్భుతమైన ప్రేమ కథ ప్రజుంమ్న ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచం ముంగిటకు వచ్చింది. ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో అది ఎంత బాధ్యతగా మసులుకోమంటుందో తెలిపే ఓ సందేశం అయింది. సర్ణోత్సవ సంబురాలు జరుపుకున్న ఈ ప్రేమ కథ క్షణిక సుఖాలు, ఆవేశాలు హత్యలు, అనర్థాలు అన్న ఆ ప్రేమ పుస్తకంలో చోటే లేదని తేల్చి చెప్పే ఓ రాజ్యాంగం అయింది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
సావిత్రికి చివరి రోజుల్లో ANR, NTR ఎందుకు సాయం చేయలేదు?
‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ లో రణదీప్ హుడా పోషిస్తున్న పాత్ర ఇదేనా ?