Advertisement
అమ్మా..అందరూ ఆడపిల్లల లాగానే, నేను కూడా వివాహం గురించి ఎన్నో ఆశలు కలలు కన్నాను. ఒక అందమైన భర్త నాకోసం వస్తాడని, ఆయనతో నా జీవితమంతా ఎంతో ఆనందంగా గడపాలని ఊహించాను.. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నా వివాహం అయిన తర్వాత గాని తెలియలేదు పెళ్లంటే పూల పాన్పు కాదని, మనం ఊహించిన దాని కంటే భిన్నంగా ఉంటుందని, వివాహమైన తర్వాత మన పై ఎన్నో బాధ్యతలు, త్యాగాలు, రాజీలు ఉంటాయని అర్థమవుతోంది. నేను నాకు నచ్చినప్పుడు నిద్ర లేవలేను, ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కంటే ముందుగా మేల్కొని, వారందరికీ కావాల్సినవి ఏంటో సిద్ధం చేయాలని ఆశిస్తారు. మన ఇంట్లో లాగా నాకు నచ్చిన డ్రెస్ లో తిరగలేను.
Advertisement
also read: తెలుగు ఇండస్ట్రీలో ఒక్క ఏడాదిలోనే 10 పైగా సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ నటులు ఎవరంటే..!!
ఇక్కడ నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. ఇంట్లో ఏ క్షణం ఎవరు పిలుస్తారు వారి పిలుపుల కోసం సిద్ధంగా ఉండాలి.. నాకు నచ్చినప్పుడు బయటకి వెళ్ళాలేను. అందరూ అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది.. నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు పడుకున్నాను, కానీ ఇక్కడ అలా కాదు నేను పడుకోవడానికి వీలు లేదు.. నేను ప్రతీ నిమిషం ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఎవరికి ఏమి కావాలో చేసి పెడుతుండాలి. అక్కడి లాగా నన్ను ఒక యువరాణిలా శ్రద్ధగా చూసుకునేవారు ఇక్కడ ఎవరూ లేరు.. నేనే అందరి శ్రద్ధ తీసుకోవాలి. ఒక్కోసారి మీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక పెళ్లి ఎందుకు చేసుకున్నానని ఏడుపు కూడా వస్తుందమ్మా, ఒక్కోసారి నీ దగ్గరికి వచ్చి నీ ఒళ్లో హాయిగా నిద్ర పోవాలనిపిస్తోంది.. నీ చేతితో నాకిష్టమైనవి వండించుకొని తినాలనిపిస్తుంది.. ప్రతిరోజు సాయంత్రం నా స్నేహితులతో బయటకు వెళ్లాలనిపిస్తోంది.
Advertisement
కానీ ఈ సమయంలోనే ఒక ఆలోచన వస్తోందమ్మా.. నువ్వు కూడా నాలాగే ఒక ఇంటి నుంచి వచ్చిన దానివే.. నువ్వు కూడా నాలాగే ఎన్నో త్యాగాలు చేసి ఉంటావు కదా.. నువ్వు ఏ విధంగా మాకు సుఖాలు సౌకర్యాలు అందించావో, వాటిని నేను కూడా ఈ ఇంట్లో అందించాలి కదా అనే విషయం గుర్తుకు వస్తోంది అమ్మ.. చివరికి చెప్తున్నాను అమ్మ.. కొంతకాలం గడిచేటప్పటికి నేను నీ లాగే నా యొక్క కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను.. నువ్వు ఏ విధంగా మాకోసం త్యాగాలు చేసావో దానికి నా కృతజ్ఞతలు అమ్మ.. నువ్వు ఆ విధంగా చేశావు కాబట్టే ఆ బాధ్యతలు నాకు సక్రమంగా ఉండటానికి కావలసిన శక్తిని ధైర్యాన్ని ఇస్తున్నాయి.. థాంక్యూ అమ్మా అంటూ ఉత్తరాన్ని ముగించింది కూతురు..
also read:బాలకృష్ణ కెరీర్ లో బాహుబలి లాంటి సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?