Advertisement
మహానటి సావిత్రి లెగసి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. తెలుగు, తమిళ భాషల్లో ఆమె తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఏఎన్నార్లకు మించిన గౌరవం, కీర్తి సావిత్రి కి దక్కింది. ఓ దశలో వాళ్ళిద్దరి కంటే తీసుకున్నారట. ఇప్పుడు హీరోలు రెండు మూడు ఏళ్లకు మూవీ చేస్తున్నారు. కానీ అప్పట్లో ఏడాదికే ఒక్క హీరో 20 నుంచి 30 సినిమాలు నిరంతరం పనిచేసేవారు. షూటింగ్లకి విదేశాలకు వెళ్లడం, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటివి అప్పుడు ఉండేవి కావు. ఒకే హీరోతో ఓ హీరోయిన్ రెండు మూడు సినిమాలు చేస్తే ఉండేది.
Advertisement
Advertisement
ఎన్టీఆర్ కి మనవరాలిగా చేసిన శ్రీదేవి పెద్దయ్యాక ఆయనతో జతకట్టింది. ఎన్టీఆర్ కి భార్యగా చేసిన అంజలి తర్వాత తల్లిగా చేసింది. ఇవన్నీ పక్కన పెడితే సావిత్రికి భర్తగా, కొడుకుగా గిరిబాబు ఒకే సమయంలో నటించారు. అది కూడా ఓకే కాలంలోనే 1973లో గిరిబాబు చిత్రపరిషంలోకి అడుగుపెట్టారు. డెబ్యూ మూవీ జగమే మాయ. అలాగే జ్యోతిలక్ష్మి టైటిల్ తో తెరకెక్కిన మూవీలో సావిత్రికి భర్తగా నటించే అవకాశం గిరిబాబుకు వచ్చింది.
Also read:
ఇదిలా ఉంటే అనగనగా ఓ తండ్రి సినిమాలో గిరిబాబు సావిత్రి కి కొడుకుగా కనిపించారు. ఈ రెండు మూవీస్ కూడా ఏకకాలంలో షూటింగ్ జరిగాయి. మధ్యాహ్నం వరకు జ్యోతిలక్ష్మి షూటింగ్లో సావిత్రికి భర్తగా నటించారు. మధ్యాహ్నం తర్వాత అనగనగా ఓ తండ్రి సినిమాలో కొడుకుగా ఆయన నటించారు ఇలా ఏకకాలంలో షూటింగ్ జరిగింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!