Advertisement
సినిమాల్లో నటించడం అంత సులభం కాదు. ట్యాలెంట్, అదృష్టం రెండు ఉండాలి అప్పుడే సినిమాల్లో రాణించగలరు. పైగా సినిమాల్లో నటించే నటులు కొన్ని కొన్ని సార్లు కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. వారి పాత్ర కోసం ఇష్టాలని పక్కన పెట్టేసి నటించాల్సి ఉంటుంది. ఈ హీరోలు మాత్రం నాన్ వెజ్ ని పక్కన పెట్టేసి సినిమాల్లో నటించారు. వారి పాత్రల కోసం నాన్ వెజ్ మానేసి సినిమా షూటింగ్ అయ్యేంత వరకు శాఖాహారం మాత్రమే తీసుకున్న వాళ్ళు ఎవరనేది చూసేద్దాం.
Advertisement
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అంటే మొదటి మనకి గుర్తొచ్చేది ఎన్టీఆర్. అన్నగారు అటువంటి సినిమాల్లో నటించేటప్పుడు నాన్ వెజ్ తీసుకోకుండా, షూటింగ్లో పాల్గొన్నారు. షిరిడి సాయి సినిమా సమయంలో నాగార్జున నాన్ వెజ్ తినకుండా షూటింగ్లో పాల్గొన్నారు. ఆ మూవీ ఫుల్ గా అయ్యే వరకు నాన్ వెజ్ ని ముట్టుకోలేదు నాగార్జున.
అలానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నటిస్తున్న బ్రో సినిమా కోసం నాన్ వెజ్ తినడం లేదు. దేవుడు పాత్రలో పవన్ కళ్యాణ్ ఇందులో నటిస్తున్నారు. కాంతార సినిమా కోసం రిషబ్ శెట్టి నాన్ వెజ్ కి దూరంగా ఉన్నారట. దైవకోల సీక్వెన్స్ షూటింగ్ ముందు 20 రోజుల నుండి నెల రోజుల పాటు మాంసాహారం తీసుకోలేదు.
Advertisement
అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా టైంలో బ్రాహ్మణుడిగా నటించారు. అప్పుడు కూడా నాన్ వెజ్ తినలేదు. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ సినిమా షూటింగ్ అప్పుడు నాన్ వెజ్ ని ముట్టుకోలేదు. ఇలా వీళ్ళకి ఇష్టమైన నాన్ వెజ్ ని కొన్ని సినిమాల కోసమని ఈ నటులు మాంసాహారానికి దూరంగా ఉన్నారు.
Also read: