Advertisement
సీనియర్ నటి ప్రగతి అంటే తెలియని వారు ఉండరు. హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో తల్లి, వదిన, హీరోయిన్ మదర్ ఇలా పలు పాత్రలలో కనిపించి నటిగా తనదైన గుర్తింపును సాధించుకుంది నటి ప్రగతి. అభిమానులు ముద్దుగా ప్రగతి ఆంటీ అని పిలుచుకుంటారు. సినిమాలలోనే కాదు ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫిట్నెస్ ఫ్రీక్, జిమ్ లో వ్యాయామాలు చేస్తూ వీడియోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈమె వీడియోలను చూసి నేటిజన్స్ సైతం ఆశ్చర్యపోతుంటారు. ఇక ఈమె పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే.
Advertisement
Read also: ఆడపడుచు చేత పెళ్ళికొడుకుని ఎందుకు చేయిస్తారు..?
Advertisement
నటి ప్రగతి చాలా రోజులుగా సింగిల్ మదర్ గానే ఉంటుంది. భర్తతో ఈమె విడాకులు తీసుకుని ప్రత్యేకంగా జీవిస్తుంది. ఇప్పటికే ప్రగతి రెండో పెళ్లిపై ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు వినిపించిన ప్రతిసారి కూడా ఘాటుగా స్పందిస్తూ వచ్చింది ప్రగతి. అయితే తాజాగా ప్రగతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రెండో పెళ్లి చేసుకోవాలని అనిపించిందా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రగతి స్పందిస్తూ.. ” హీరోయిన్ గా జీవితం సాగిపోతున్నప్పుడు తీసుకున్న ఓ నిర్ణయం నా జీవితాన్ని 10 నుండి 20 ఏళ్ల వెనక్కి లాగేసింది.
నేను చేసిన ఆ పొరపాటు ఎర్లీ మ్యారేజ్. పెళ్లి అనడం కంటే దానిని కంపానియన్ అంటే బెటర్. ఒక్కోసారి తోడు కావాలి అనిపిస్తుంది. అయితే నా మెచ్యూరిటీకి మ్యాచ్ అయ్యే వ్యక్తి దొరకాలి కదా. అది కాక సింగల్ పర్సన్ దొరకడం చాలా కష్టం. నన్ను భరించడం కూడా అంత సులభం కాదు. ఇలాగే ఉండాలి అనే పర్టికులర్ గా ఉంటాను. 20 లలో ఉంటే కొంచెం అడ్జస్ట్ అయ్యేదాన్ని కానీ.. 40లోకి వచ్చేసాను. కాబట్టి అడ్జస్ట్ కాలేను. నాలాగే ఆలోచించే వ్యక్తి కావాలి” అంటూ తెలిపింది.
Read also: పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్