Advertisement
రేణుక స్వామి హత్య కేసులో దర్శన్ పవిత్ర గౌడ తో సహా 17 మంది నిందితులు జైల్లో ఉన్నారు. బెంగళూరు పరంప అగ్రహారం జైల్లో నిబంధన ఉల్లంగించినందుకు దర్శన్ ని బళ్ళారి జైలుకు పంపించారు. మౌనంగా ఉన్నప్పటికీ లోపల అతను కుమిలిపోతున్నాడని తెలుస్తోంది. హీరో దర్శన్ మీడియా పై మండిపడుతున్నారు. తన భార్య విజయలక్ష్మి సోదరుడు దినకర్ న్యాయవాదులు బళ్లారి జైలుకు వచ్చారు. ఈ సమయంలో నిందితుడు దర్శన్ పోలీసులు సందర్శకులు గదికి పిలిచారు. ఈ వార్తలని కవర్ చేయడానికి అక్కడికి చేరుకున్న మీడియాను చూసి సహనాన్ని కోల్పోయి మధ్య వేలు మీడియాకి చూపించారు.
Advertisement
జైలు బయట ఉన్న మీడియాను చూసిన దర్శన్ ఇంకాస్త రెచ్చిపోయాడని ఆరోపణలు వచ్చాయి. కానీ పోలీసులు మధ్యలో ఉన్నందుకే హీరో దర్శన్ అతని మధ్య వేలు మీడియాకు చూపించాడని కన్నడ మీడియా చెప్పింది. అంతేకాకుండా హీరో దర్శన్ లోపల నవ్వుతున్నాడు అని తెలుస్తోంది. జైల్లో ఉన్న దర్శన్ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ముందు పశ్చాత్తాపంతో మాట్లాడినట్లు కన్నడ మీడియా చెప్పింది.
Advertisement
Also read:
దర్శన్ కి పశ్చాతాపం లేదని ముఖంలోనే కాదు ఆయన చర్యల్లో కనిపించట్లేదని కొన్ని మీడియా సంస్థలు అంటున్నాయి. హత్య కేసులో జైలుకు వెళ్లిన దర్శన్ కి అహంకారం మాత్రం తగ్గలేదని కొన్ని సంస్థలు అంటున్నాయి. దర్శన్ ఫ్యాన్స్ మాత్రం హీరో త్వరగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. ఛార్జ్ షీట్ సమర్పించిన తర్వాత దర్శన్ బెయిల్ కోసం ఎదురు చూస్తున్నాడు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!