Advertisement
ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు దర్శనమివ్వబోతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్రపుదలతో నిరుపేదల కడుపు నింపడానికి సిద్ధమయ్యాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు నాలుగవ సంతకాన్ని అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పై చేసారు. దీంతో రాష్ట్రంలో తిరిగి ఈ క్యాంటీన్లు ప్రారంభానికి మార్గం సుగమయమైంది. త్వరలో అధికారికంగా దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. గతంలో ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ కూడా అందించిన అన్న క్యాంటీన్లలో ఐదేళ్ల విరమణ తర్వాత కూడా అదే ధరలకు ఇస్తారా లేదంటే పెరగనున్నాయా అనే చర్చ జరుగుతోంది.
Advertisement
ఎందుకంటే ఐదేళ్లలో ద్రవ్యోల్బలనం భారీగా పెరిగింది. బియ్యం పప్పు దినుసులు రేట్లు కూడా పెరిగాయి. ఇలాంటి సమయంలో అన్న క్యాంటీన్లలో ధరలపై జరుగుతున్న చర్చకు తెర దించుతూ స్వయంగా సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. సీఎం గా చంద్రబాబు నాలుగవ ఫైలు పై అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసారు.
Advertisement
Also reaad:
Also read:
చంద్రబాబు నాయుడు ఈసారి అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్థాలను కూడా వెల్లడించారు ఈసారి కూడా టిఫిన్ అయిదు రూపాయలు, రెండు పుట్ల భోజనం కూడా ఐదేసి రూపాయలు చొప్పున ఉంటుందని అన్నారు. ధరలతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం టిఫిన్ లభిస్తాయని మొత్తం మూడు పూట్లకి 15 రూపాయలు తో తినచ్చని అన్నారు. రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపడానికి సర్కార్ సిద్ధపడిందని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!
https://telugu.oneindia.com/news/andhra-pradesh/anna-canteens-to-be-resumed-soon-after-5-years-in-ap-here-are-prices-for-tiffin-and-meals-391307.html