Advertisement
పూజ గదిలో సాధారణంగా ఇష్ట దేవతల ఫోటోలను ఉంచుకోవడం సాంప్రదాయం. అయితే చాలామంది ఇంటి నిర్మాణం చేపట్టిన సమయంలో అన్ని గదుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ పూజగది గురించి ఎక్కువగా పట్టించుకోరు. కొంతమంది పూజ కోసం ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించుకుంటే.. మరికొంతమంది కిచెన్ రూమ్ లో ఓ పక్కగా చిన్న అల్మారాని కేటాయిస్తారు. ఇక మరికొంతమందికి మాత్రం ప్రత్యేకంగా పూజ గది అంటూ ఏమీ ఉండదు. ఇదిలా ఉంటే.. హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు.
Advertisement
Read also: తారకరత్న జీవితంలో ఇలా కూడా మోసపోయారా ? ఇన్ని కష్టాలను ఎలా భరించగలిగారు ?
అయితే మరి కొంతమంది మాత్రం దేవుళ్ళు, దేవతలతో పాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫోటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ళ పక్కనో ఉంచి వాటికి కూడా నిత్యం నమస్కరించుకుంటూ ఉంటారు. అయితే మరణించిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం, వారిని పూజించడం తప్పు కాదు కానీ.. దేవుడి దగ్గర చనిపోయిన వారి ఫోటోలను ఉంచకూడదట. ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచడం మంచిది కాదు. దీంతో ఆ కుటుంబానికి మంచి జరగదని చెబుతున్నారు.
Advertisement
మనిషి ఎప్పుడూ దేవుడికి సమానం కాదని.. అందుకే పూజ గదిలో దేవతల ఫోటోలు మాత్రమే ఉంచాలని, మరణించిన వారి ఫోటోలు పూజగదిలో పెట్టకూడదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా మానసిక ప్రశాంతత ఉండదు. ఇళ్లలో ఈశాన్య దిశగా పూజ గదిని, నైరుతి దిశగా చనిపోయిన వారి ఫోటోలను ఉంచాలని వాస్తు సిద్ధాంతం చెబుతుంది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఇంట్లోకి నెగిటివ్ శక్తి ప్రసారమవుతుంది. ఆ కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత ఉండదు. అందువల్ల చనిపోయిన వారి ఫోటోలను దేవుడి పూజ గదిలో ఉంచకూడదని చెబుతున్నారు.
Read also: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేసాడు ?