Advertisement
చైత్రమాసంలో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. పాల్గుణ మాసంతో ముగుస్తుంది. నాలుగవ నెల ఆషాడమాసం. ఈ కాలంలో కొత్తగా పెళ్లయిన దంపతులు కలవకుండా జాగ్రత్త పడతారు. నూతన వధువులు పుట్టింటికి వెళ్ళిపోతారు. శాస్త్రీయ కారణాలు కూడా దీని వెనుక ఉన్నాయని పెద్దలు అంటూ ఉంటారు. ఈ మాసం వ్యవసాయానికి చాలా అనుకూలమైనది. తీర్థయాత్రలో భగవంతుని ప్రార్ధన మంత్రాలు పాటించడం, ఇలాంటివి చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అందుకే ఈ కాలంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించారు.
Advertisement
ఆషాడ మాసం ప్రాముఖ్యత గురించి మరిన్ని విషయాలని కూడా చూసేద్దాం. రేపటి నుండి ఆషాడ మాసం మొదలవుతుంది ఆషాడమాసంలో శ్రీమహావిష్ణువుని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఈ నెలలో మట్టి కుండ, గొడుగు, ఉప్పు, జామకాయల్ని దానం చేయడం వలన చాలా పుణ్యం వస్తుందట. ఈ నెలలో ఎక్కువగా యాగాలు చేయాలి. ఈ నెల నుండి వర్షాలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ నెలలో యాగం నిర్వహించడం వలన హానికరమైన కీటకాలు గాలి నీటి నుండి వచ్చే ఇన్ఫెక్షన్ నుండి తప్పించుకోవచ్చు.
Advertisement
Also read:
గురు పూర్ణమి నాడు గురువుల్ని పూజించడం వలన ఐశ్వర్యం కలుగుతుందట. ఈ మాసంలో శ్రీమహావిష్ణువుతో పాటుగా ఈశ్వరుడుని హనుమంతుడిని సూర్య దేవుడిని అంగారకుడుని పూజించాలి. ఎవరి జాతకంలో అయితే కుజుడు, సూర్యుడు బలహీనంగా ఉంటాడో ఆషాడంలో శివుడు శ్రీహరితో పాటుగా దుర్గాదేవిని కూడా పూజించాలి. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వలన శారీరక బాధలు తొలగిపోతాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!