Advertisement
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఇంట్లో పెళ్లి వేడుక జరగనుంది. షర్మిల-అనిల్ కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజారెడ్డి పెళ్లికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరి వైఎస్ షర్మిల కాబోయే కోడలు ఎవరో తెలుసా? ఆమె పేరు ప్రియా అట్లూరి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన యువతి. ప్రియా అట్లూరి అమెరికాలో స్థిరపడింది. అమెరికా పౌరసత్వం కూడా ఉంది.
Advertisement
వైఎస్ రాజా రెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమ వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రాజా రెడ్డి అక్కడ ప్రియా అట్లూరిని కలిశారు. త్వరలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమ వివాహానికి.. షర్మిల-అనిల్ జంట.. ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు. వైఎస్ షర్మిల-అనిల్ కుమార్ దంపతులు, ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు ఆమోదం తెలిపారు.
Advertisement
అయితే అట్లూరి ప్రియా ఎవరు? అన్న విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. బ్రదర్ అనిల్ స్నేహితుడు శ్రీనివాస్ అట్లూరి కూతురే ప్రియా అట్లూరి అని తెలుస్తోంది. బ్రదర్ అనిల్ కు సంబంధించి వ్యాపార లావాదేవీలను శ్రీనివాస్ గారే చూస్తారని.. ఆయనకు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉందని తెలుస్తోంది. అట్లూరి ప్రియా అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె అని వార్తలు వస్తున్నాయి. అట్లూరి శ్రీనివాస్ ది కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ.. ఆయన గతంలోనే క్రిష్టియానిటీ స్వీకరించారని అంటున్నారు. బ్రదర్ అనిల్ తో అట్లూరి శ్రీనివాస్ కు ఉన్న స్నేహం త్వరలోనే బంధంగా మారబోతోంది అని అంటున్నారు. ఇదంతా ప్రస్తుతానికి ప్రచారమే. త్వరలోనే షర్మిల కుటుంబం కూడా అఫీషియల్ గా ప్రకటన చేస్తే.. ప్రియా గురించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Read More:
భువనేశ్వరి గారితో బాబు పెళ్లి నిశ్చయించిన తరువాత .. చంద్రబాబు ఎన్టీఆర్ తో కోరిన కోరిక ఏంటంటే ?
అసలు ఏమి మాట్లాడుతున్నావు రా నాయన? సలార్ గురించి ఈ కన్నడ స్టార్ ఇంత దిగజారి మాట్లాడాలా??