Advertisement
1972 వ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎంతో కీలకమైన మార్పులు చోటు చేసుకున్న సంవత్సరం. ఆ ఏడాది ఆయన ఏకంగా 18 సినిమాలకు పైగా నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పని చేస్తూ షూటింగ్స్ చేసేవాడు. తన ఎనర్జీ మొత్తాన్ని పని కోసమే ఎందుకు కేటాయించేవారో తెలుసా? దానికి కారణం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 1991 , 92 సంవత్సరాల్లో కృష్ణ గడ్డు రోజులనే ఎదుర్కొన్నారు. చేతిలో ఒక్క సినిమా లేదు. నిర్మాతలు కనిపించినా మొహం చాటేసేవాళ్ళు. అప్పటికే కృష్ణకి ఇండస్ట్రీ గురించి ఒక ఐడియా వచ్చేసింది. సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది అని తెలిసిన వ్యక్తి. ఓ మంచి అవకాశం కోసం కృష్ణ చాలా వెయిట్ చేసారు.
Advertisement
ఆ తరువాత తమ్మారెడ్డి డైరెక్షన్ లో “పచ్చని సంసారం” సినిమా వచ్చింది. ఆ సినిమా హిట్ అయింది. కమర్షియల్ గా సక్సెస్ రావడంతో కృష్ణకి మళ్ళీ అవకాశాలు ఇవ్వడానికి ఫోన్స్ వచ్చేవి. మళ్ళీ బిజీ అయిపోయాడు. ఆ తరువాతే అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చింది. ఆ సినిమాలోని పాత్రతో ప్రజలు ఏ రేంజ్ లో కనెక్ట్ అయిపోయారంటే.. ఏ సినిమాలో నటించినా ఆ క్యారెక్టర్ తోనే పోల్చేవారు. దీనితో మళ్ళీ ఫ్లాప్స్ వచ్చాయి. అప్పటికే కృష్ణ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయి ఉండడంతో.. తానే సినిమాలు నిర్మించేవాడు. మోసగాళ్లకు మోసగాడు, సింహాసనం వంటి సినిమాలను కృష్ణే నిర్మించాడు.
Advertisement
ఓసారి సీనియర్ జర్నలిస్ట్ పి ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి సూపర్ స్టార్ కృష్ణని కలిశారు. ఆయన మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు.. అని మాటవరసకు అనబోతే.. కృష్ణ వారించి చేతిలో ఒక్క సినిమా లేదు అండీ నిజానికి అని అన్నారట. అదేంటండీ అని ప్రశ్నిస్తే.. ఇండస్ట్రీలో అంతేనండి.. సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది.. నాకు వరుసగా కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి.. అందుకే ఈ గడ్డు రోజులు అంటూ చెప్పుకొచ్చారట. అప్పటి నుంచే కృష్ణ పని రాక్షసుడు అయిపోయారు. వరుస సినిమాలు చేసుకుంటూనే సూపర్ స్టార్ గా ఎదిగారు.
Read More:
పొలిమేర 2 సినిమాలో ఉన్న ఆ గుడి నిజంగానే ఉందా? అందులో నిధులు ఉన్నాయా?
Mangalavaram Review మంగళవారం రివ్యూ & రేటింగ్ !
పెళ్లి పీటల పైన చిరంజీవి చిరిగిన చొక్కాతోనే ఎందుకు తాళి కట్టారు ?