• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Balagam OTT: “బలగం” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!

Balagam OTT: “బలగం” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on March 23, 2023 by karthik

Advertisement

Balagam OTT Release Date: ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన బలగం సినిమా మార్చ్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో ఈ సినిమా కథ మొత్తం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, యాస, గోస, కట్టుబాట్లు.. ఇలా సమస్తం ఈ సినిమాలో కనిపిస్తాయి. Balagam Movie OTT release Dateఈ చిత్రంలో పెద్ద తారలు లేకపోయినప్పటికీ ఈ సినిమాకి తగిన స్థాయిలో ప్రచారం లభించింది అంటే దిల్ రాజు వెనుక ఉండడమే కారణం.

Read also: AKHANDA MOVIE DIALOGUES: ‘అఖండ’ మూవీలో గూస్ బంప్స్ తె ప్పించే డైలాగ్స్

Balagam OTT

Balagam OTT

Balagam Movie OTT Release Date

ఈ సినిమా కథ చనిపోయిన తర్వాత కాకులకు పిండం పెట్టడం నేపథ్యంలో ఉంటుంది. తెలంగాణలో ఓ చావు చుట్టూ జరిగే సన్నివేశాన్ని పక్కాగా ఆవిష్కరిస్తూనే.. ఓ కుటుంబంలోని సంఘర్షణని అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాని తెరకెక్కించారు దర్శకుడు వేణు. అలాగే ఈ చిత్రంలో తెలంగాణ పల్లెటూరి జీవితంలో అంతర్భాగమైన జానపదాలను, సంగీతాన్ని, బుర్రకథలను, ఇతర పల్లె కళారూపాలను అద్భుతంగా అవసరం మేరకు వాడుకున్న తీరు బాగుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

Advertisement

Balagam OTT Release Date

Balagam OTT Release Date

Balagam OTT Platform & Streaming Date

ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించేసరికి ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకు తగ్గట్లే ఆ డీటైల్స్ కూడా వచ్చేసాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఓ సాలిడ్ రేటుకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ రెండవ వారంలో ఈ చిత్రం ఓటీటీ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. సినిమాకి మంచి మౌత్ టాక్ వస్తుండడంతో కచ్చితంగా మంచి వసూళ్లు లభిస్తాయి అని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే నైజాం ఏరియాలో రూ. 1 కోటి షేర్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Read also: Rangamarthanda OTT, Release Date, Platform, OTT Rights: రంగమార్తాండ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎందులో.. ఎప్పుడంటే?

 

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd