Advertisement
బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్లో అనగానే ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మువ్వగోపాలుడు’, ‘ముద్దుల మావయ్య’ లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే ఆ తర్వాత హఠాత్తుగా వారి కాంబినేషన్ లో ఆగిపోయింది. ఈ సినిమాలు నాలుగింటికి భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి నిర్మాత. ఆ తర్వాత కూడా ఈ ముగ్గురు కలిసి ఓ జానపద సినిమా మొదలుపెట్టారు. కానీ, అనుకోకుండా అది సగం షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు గోపాల్ రెడ్డి కానీ కోడి రామకృష్ణ కానీ మన మధ్య లేరు. అయితే బాలకృష్ణను అగ్ర హీరోగా మార్చిన సినిమాలను డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణతో బాలయ్య మళ్ళీ ఎందుకు సినిమా చేయలేదనే ప్రశ్న చాలా మందిలో ఉండిపోయింది.
Advertisement
కొన్ని ఏళ్ల క్రితం ఈ ప్రశ్నకు కోడి రామకృష్ణ జవాబిచ్చారు. అన్నీ కుదిరితే తమ కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, “భార్గవ్ ఆర్ట్స్ లో బాలయ్యతో నిజంగా గొప్ప సినిమాలే చేశాను. గోపాల్ రెడ్డి గారికి కూడా బాలయ్య అంటే విపరీతమైన అభిమానం. ‘మంగమ్మగారి మనవడు’ తర్వాత బాలయ్య టాప్ స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్లే బాలయ్యతో ఏ సినిమా తీసిన అడగకుండానే పారితోషకం పెంచేవారు గోపాల్ రెడ్డి. ‘ముద్దుల మావయ్య’ తర్వాత బాలయ్య దాదాపు నంబర్ వన్ అయ్యారు. ఆయన పారితోషికం కూడా బాగా పెరిగిపోయింది. ‘ఇప్పుడు మనం బాలయ్యతో సినిమా తీస్తే మనకోసం ఆయన పారితోషికం తగ్గించుకోవాలి. అలాంటి పరిస్థితి మన బాలయ్యకు రాకూడదు. ఆ స్థాయి పారితోషకం ఇచ్చే స్థాయికి మనం చేరుకున్నాకే సినిమా తీద్దాం’ అన్నారు గోపాల్ రెడ్డి. అందుకే మళ్లీ మా కాంబినేషన్ లో సినిమాలు రాలేదు” అని ఆయన చెప్పారు.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
తమ కాంబినేషన్ లో మొదలై, ఆగిపోయిన జానపద సినిమా గురించి కూడా కోడి రామకృష్ణ తెలిపారు. ” కొందరు మధ్యవర్తుల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇందులో అంతకుమించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నిజానికి సినిమా 60 శాతం పూర్తయింది. రెడ్డిగారు బతికుంటే పూర్తి చేసేవాళ్లం” అని ఆయన వెల్లడించారు. ఏదేమైనా బాలకృష్ణ, కోడి రామకృష్ణ, ఎస్. గోపాల్ రెడ్డి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిందనేది నిజం. కోడి రామకృష్ణ 2019 ఫిబ్రవరి 22న కన్నుమూయగా, ఎస్. గోపాల్ రెడ్డి అంతకంటే చాలా ముందుగా 2008లో మృతి చెందారు.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?