Advertisement
నందమూరి తారకరత్న మరణం వల్ల వారి ఫ్యామిలీలో విషాద చాయలు అలుముకున్నాయి. తారక రత్న మంచి మనిషి అని సన్నిహితుల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులతో సమానంగా తారకరత్న ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తులను చూసుకుంటారని చెబుతున్నారు. తారక రత్న గురించి ఎవరిని అడిగినా ఆయన మంచితనం గురించే చెబుతున్నారు తప్ప ఆయనపై ఒక్క నెగిటివ్ లేదని చెప్పవచ్చు.
Advertisement
అయితే తారకరత్నకు నివాళులర్పించే క్రమంలో ఒక అజ్ఞాత వ్యక్తి ఆయన పార్తివదేహానికి ఫిలిం ఛాంబర్ లో హల్చల్ చేసిన సంగతి మనందరం చూసాం. ఆ వ్యక్తి నేరుగా బాలయ్య దగ్గరికి వెళ్లి వేలెత్తి చూపుతూ మాట్లాడారు. బాలకృష్ణ ఆ వ్యక్తి చెబుతుంటే తలువుపారు.. నిజానికి ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆ వ్యక్తి ఫిలింనగర్ లో నివసిస్తాడని తెలుస్తోంది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఫిల్మ్ నగర్ చుట్టుపక్కల తిరుగుతాడని కానీ ఆయన మాటలు ఎవరూ లెక్క చేయరని సమాచారం.
Advertisement
మరికొందరేమో బాలయ్యను దేవుడు ఏదో ఒక విషయంలో ఆ విధంగా హెచ్చరించారని చెబుతున్నారు. ఏవైనా దోషాలు ఉంటే పరిహారాలు చేస్తే మంచిదని కామెంట్లు పెడుతున్నారు. ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చి బాలకృష్ణ తో మాట్లాడారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శివుడు పలు రూపాల్లో దర్శనం ఇస్తాడని కామెంట్ చేస్తున్నారు. త్వరలో బాలయ్య ఈ కామెంట్లపై స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
also read:Chanakya niti:భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!