Advertisement
భారత్ బంగ్లాదేశ్ యుద్ధం మొదలవ్వబోతోంది. భారత్ పర్యటనలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు T20 లు ఆడనుంది. టీమిండియా ఫేవరెట్ అయినప్పటికీ పాక్ ని సొంత గడ్డపై బంగ్లాదేశ్ క్లీన్స్వీప్ చేయడంతో ఈ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. పాక్ ని ఓడించినట్లే టీమిండియాకు బంగ్లాదేశ్ షాక్ ఇస్తుంద అనే ప్రశ్నలు వస్తున్నాయి. పాక్ ని ఓడించడంలో బంగ్లా స్పిన్నర్లది కీలక పాత్ర. తొలి టెస్ట్ వేదికైనా చపాక్ కూడా సాధారణంగా స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పిచ్ ని ఏ విధంగా రూపొందిస్తారు అనేది దాని గురించి ఆసక్తికరంగా మారింది.
Advertisement
Advertisement
స్పోర్టింగ్ వికెట్ లాగా కనిపిస్తుంది అని ఎప్పటి నుంచి బంతి టర్న్ అవుతుందో అర్థం కావట్లేదని అందరూ అంటున్నారు. ఇది చూడడానికి ఈ స్థితిలో స్పోర్టింగ్ వికెట్ లాగా కనపడుతుంది కానీ ఉపఖండ పిచ్ పరిస్థితులతో పోలిస్తే తొలి రోజు నుంచి కూడా స్వభావం మారొచ్చు. ఎప్పటి నుంచి టర్న్ అవుతుందనేది తెలియదు అని అంటున్నారు. వికెట్ ని సమతూకంతో ఉండేలా సిద్ధం చేస్తున్నారని స్పిన్నర్లకు అనుకూలించిన బంతి బ్యాటర్లకు కష్టంగా మారుతుంది అని సమాచారం.
Also read:
చెపాక్ గురించి సీనియర్ క్యూరేటర్ స్పందిస్తూ రెండు వారాలుగా చెన్నైలో వాతావరణం వేడిగా ఉందని పిచ్ కి నీళ్లు పడుతున్నామని చెప్పారు. మ్యాచ్ సాగే కొద్ది స్పిన్ కి అనుకూలంగా ఉంటుందని.. బ్యాటర్లకి సవాలుగా ఉంటుందని చెప్పారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!