Advertisement
టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు తయారు సంస్థలు కొత్త కొత్త ఫీచర్లు సరికొత్త హంగులతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే పనితీరు బాగుండి కెమెరా, బ్యాటరీ, స్మూత్ డిస్ ప్లే తో రూ.20 వేలకు కు మార్కెట్లో ఇప్పటికే కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటున్న ఫోన్ల గురించి తెలుసుకుందాం.
Advertisement
#1 5 జి పోకో ఎక్స్ 4 ప్రో
రూ 20 వేల లోపు బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఫోన్ ల స్థానంలో పోకో ఎక్స్ 4 ప్రో నిలిచింది. 6.67 అంగుళాలతో ఎఫ్ హెచ్ డి ప్లస్ అమోలేడ్ డిస్ప్లే, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, ఫాస్ట్ ఫర్మా మెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 695 చీప్ సెట్, 5000 ఏ ఎం హెచ్ బ్యాటరీ, 67 డబ్ల్యు చార్జర్, 64 ఎంపీ లెడ్ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో లభ్యమవుతుంది.
#2 5జి రెడ్మీ నోట్ 11 ప్రో
షావోమికి చెందిన రెడ్ మీ నోట్ 11 ప్రో. దీని ధర రూ. 18,999గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే హెలియా జి 96 చీప్ సెట్ తో రూ. 20000 లోపు బడ్జెట్ ధర ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
Advertisement
#3 5జి ఐ క్యు జెడ్ 6
రూ.15 వేల లోపు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఐక్యూ జెడ్ 6 బెస్ట్ ఆప్షన్ అని మార్కెట్ పండితులు చెబుతున్నారు. 50 ఎంపీ, 2 ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెట్అప్ తో డిజైన్ చేసి ఉంది. ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది.
#4 5జి రియల్ మీ 9 ప్రో
రియల్ మీ 9 ప్రోలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695, 5జి ప్రాసెసర్,6.6 అంగుళాల డిస్ప్లే, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ ఛార్జర్, 64 ఎంపీ నైట్ స్కేప్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు 2 ఎంపీ మైక్రో లెన్స్ తో అందుబాటులో ఉంది.
#5 మోటోజి 52
మోటోరోలా మోటో జి 52 సూపర్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ 6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డి ప్లస్ పిఓఎల్ ఈడి డిస్ప్లే, 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అండ్ 2 ఎంపీ సెన్సార్ లతో ఈ ఫోన్ రూ.14,999కే లభ్యమవుతుంది.