Advertisement
కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో నటించారు. ఎస్. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించారు. ఇక మూవీ కథ, రివ్యూ చూసేద్దాం.
Advertisement
సినిమా: భారతీయుడు-2
నటీ నటులు: కాజల్ అగర్వాల్. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు
దర్శకుడు: ఎస్. శంకర్
నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
రిలీజ్ డేట్: 12-07-2024
కథ మరియు వివరణ:
కథ విషయానికి వచ్చేస్తే ఇండియాలో విపరీతంగా లంచాలు తీసుకోవడం అవినీతి పెరుగుపోవడంతో పాటుగా సామాన్య జనాలు బతకడం కూడా కష్టమవుతుంది. ఈ టైం లో సిద్ధార్థ భారతీయుడు మళ్ళీ తిరిగి రావాలి, సేనపతి వస్తేనే సిస్టం అంతా బాగుంటుందన్న ఉద్దేశంతో భారతీయుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కనుక్కుంటాడు. సేనపతి వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టం ఎలా సెట్ చేస్తాడు..? అవినీతిపైన ఎలాంటి యుద్ధం చేస్తాడు మొత్తానికి ఇక్కడున్న సిస్టం ని మార్చగలిగాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాలి. దర్శకుడు శంకర్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాని కూడా ఎంతో గ్రాండ్ గా తెరమీదకి తీసుకువచ్చారు. ఎక్కడ రాజీపడకుండా విజువల్స్ పరంగా ఉన్నతమైన స్థాయిలో సినిమాని తెరకెక్కించారు. విజువలైజేషన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకి తెలియజేశారు.
Advertisement
సేనాపతి ఇండియాకు వచ్చేంత వరకు కొంచెం బోరింగ్ గా ఉంటుంది కానీ తర్వాత స్క్రీన్ పై చాలా ఫాస్ట్ గా నడిపించే ప్రయత్నం చేశారు. కమల్ హాసన్ అద్భుతంగా నటించారు శంకర్ కూడా కమలహాసన్ కి ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు కమలహాసన్ పాత్రలో మొదటి నుండి చివరిదాకా జీవించేశారు. అలాంటి పాత్రలు చేయాలంటే కమలహాసన్ పర్ఫెక్ట్. నట విశ్వరూపాన్ని మరోసారి సినిమాలో చూపించారు అవినీతి పైన సినిమాలు చేసి దాని కమర్షియల్ గా సక్సెస్ చేయడంలో శంకర్ ని మించిన దర్శకుడు ఇంకొకరు లేరని ప్రూవ్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో అయితే శంకర్ డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది సెంటిమెంటల్ సీన్స్ కూడా హై ఫీల్ ఇచ్చాయి. ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. కమలహాసన్ చేసిన కొన్ని సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. నిజంగా ఆయన యాక్టింగ్ ని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు.
Also read:
ఈ వయసులో కూడా ఆ పాత్ర కోసం ఎంతో డెడికేషన్ తో పని చేశారని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే. అనిరుద్ మ్యూజిక్ ని పర్ఫెక్ట్ గా ఇవ్వలేకపోయారు. భారతీయుడు సినిమాలో ఏఆర్ రెహమాన్ ఎలాంటి మ్యూజిక్ అయితే ఇచ్చాడో ఇప్పుడు అనిరుద్ అటువంటి మ్యూజిక్ ఇవ్వడంలో కొంచెం తడబడ్డాడు. విజువల్స్ పరంగా ఈ సినిమాకి ప్లస్ అయింది. రవివర్మన్ అందించిన విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.
Also read:
ప్లస్ పాయింట్స్:
కమల్ హాసన్ నటన
దర్శకత్వం
విజువల్స్
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టడం
బ్యాగ్రౌండ్ స్కోర్
Rating: 2.75/5
తెలుగు సిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!