Advertisement
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెడకు ఢిల్లీ లిక్కర్ స్కాం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కల్వకుంట్ల కవిత ఉన్నట్లు బిజెపి పార్టీకి చెందిన నేతలు… ఇటీవల ఆరోపణలు చేశారు. అదే అదునుగా చేసుకున్న తెలంగాణ బిజెపి పార్టీ నాయకులు కూడా… కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే…. కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ లభించింది.
Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఆమెపై మీడియా, సోషల్ మీడియాలో ఎవరు విమర్శలు చేయవద్దని సివిల్ కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆమెపై ఆరోపణలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్టే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందంటూ ప్రధానంగా కవితపై బిజెపి ఎంపీ పర్వేశ్ వర్మ, ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజిందర్ ఘాటు ఆరోపణలు చేశారు.
Advertisement
ఈ వ్యవహారంలో కవిత పాత్రపై సిబిఐ విచారణ జరుపుతోందని, త్వరలోనే వివరాలు వెళ్లడవుతాయని బిజెపి ఎంపీ మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కవితకు సంబంధాలు ఉన్నాయంటూ బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా విమర్శలకు పదును పెట్టింది. మరోవైపు తన పరువుకు భంగం కలిగించేలా బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారని ఆమె పరువు నష్టం కేసు కూడా వేశారు. ఈ తరుణంలోనే ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని మద్యంతర ఆదేశాలు ఇచ్చింది. అలాగే బిజెపి ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13 కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి : త్రివిక్రమ్ సినిమాల్లో హీరోల చంకల్లో బ్యాగులు ఎందుకు ఉంటాయి?