Advertisement
“వినరా వినరా ఓ నరుడా బ్రహ్మమాట పొల్లు పోదురా.. కాలజ్ఞానం కల్ల కాదురా” అంటూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ నిజమవుతున్నాయి. పల్లె అయినా, పట్టణమైన, ఇళ్లయిన, రచ్చబండ దగ్గరైన, ఏ ఇద్దరు కలిసినా “విన్నారా.. చూశారా అంతా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ నిజమవుతున్నాయా! అంటే అవుననే అంటున్నారు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రజలు. ఎందుకంటే తాటి, ఈత, వేప చెట్టుకు కల్లు రావడం మన అందరికీ తెలిసిన విషయమే..
Advertisement
Read also: లేస్ ప్యాకెట్ లో సగం గాలి, సగం చిప్స్ ని ఎందుకు నింపుతారు ?
ఆ గ్రామంలో ఓ చింత చెట్టు నుంచి కల్లు వస్తుంది. పాలకుర్తి మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద చింతచెట్టు నుంచి కల్లు పారుతున్న విషయాన్ని ఇంటి యజమానులు గమనించారు. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం పాకింది. వాట్సాప్ గ్రూపులో ఈ విషయం వైరల్ అయింది. దీంతో అంగడి బజారులో ఎల్లబోయిన సొమ్ములు ఇంటి ఆవరణలో ఉన్న చింత చెట్టుకు కళ్ళు ఏరులై పారుతుందని తెలిసిన జనాలు ఆశ్చర్యంతో తండోపతండాలుగా వచ్చి విచిత్రంగా చూస్తున్నారు. అంతేకాదు ఉన్నట్టుండి చింత చెట్టు కూడా కలర్ రావడంతో జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Advertisement
దీంతో కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్లే జరుగుతుందని చర్చించుకుంటున్నారు. దీంతో ఏం ముప్పు ముంచుకొస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. అయితే ఇందులో వింత ఏమీ లేదని.. వేప, చింత, మర్రి తదితర చెట్లకు రోగాలు వస్తాయన్నారు. అలా ఆ చెట్టు కట్ అయిన ప్రాంతంలో బ్యాక్టీరియా చేరినప్పుడు కొన్ని చెట్లలో నురగలాగా రావడం సహజం అంటున్నారు కొంతమంది. ఏది ఏమైనప్పటికీ ఈ వింతను చూడడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి విచిత్ర ఘటనలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని మాట్లాడుకుంటున్నారు జనగామ జిల్లా పాలకుర్తి వాసులు.