Advertisement
Janasena party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిసి పోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సమయమైతే దగ్గర పడుతోంది. జనసేన పార్టీ ఈ మేరకు జోరు పెంచింది ఒకవైపు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి పార్టీ ని తీసుకెళ్తున్నారు మరో వైపు నాయకత్వాన్ని పటిష్టం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ లో చేరికకి ఆసక్తి చూపిస్తున్న నాయకుల్ని ఆహ్వానిస్తున్నారు తాజాగా చైతన్య జనసేన పార్టీ లో చేరారు. ఈమె ఎవరంటే ప్రముఖ వ్యాపారవేత్త టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు. ఈమె మంగళగిరి లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం కి వచ్చారు.
Advertisement
Advertisement
janasena meeting in machilipatnam
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమెకి కండువా కప్పి పార్టీ లోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఆమె కి పవన్ శుభాకాంక్షలు చెప్పారు. తాత అది కేశవులు నాయుడు మాదిరిగానే రాజకీయ నాయకురాలుగా మంచి పేరు తెచ్చుకోవాలని చైతన్య కి చెప్పారు పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా కి చెందిన డీకే ఆది కేశవుల నాయుడు కూతురు తేజస్వి కూతురు చైతన్య. ఈమె ఇప్పటికే ఒక ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు.
adhikeshavulu Grand Daughter
జనసేన పార్టీ విధానాలకి ఆకర్షితురాలైన ఆమె తాజాగా ఈ పార్టీ లో చేరడం జరిగింది. తాత వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న చైతన్య ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆమె జనసేన పార్టీ లో చేరడం మంచి పరిణామం అని చెప్పారు. ఎంపీగా చిత్తూరు అభివృద్ధి, టిటిడి బోర్డు చైర్మన్ గా తిరుమల అభివృద్ధికి ఆది కేశవ నాయుడు ఎంతో కృషి చేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!