Advertisement
తెలుగు ఇండస్ట్రీని టాప్ లెవల్లో దేశం గర్వించదగ్గ రేంజ్ కి తీసుకెళ్లిన హీరోలలో ముందు వరుసలో ఉండేది అలనాటి హీరో నందమూరి తారక రామారావు. అలాంటి అన్న ఎన్టీఆర్ తన కూతురు చంద్రబాబు నాయుడుకి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు మెల్లిమెల్లిగా మామ ఎన్టీఆర్ ను పక్కకు తోసి టిడిపి పగ్గాలు చేతబట్టి, చివరికి ఆయన కూడా ఏపీ సీఎం అయ్యారు. చంద్రబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. అయితే ఆయన పెళ్లికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఆహ్వానించిన పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Advertisement
ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరితో నా పెళ్లి అని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఈ కార్డులో ఉంది. చంద్రబాబు మరియు భువనేశ్వరిల పెళ్లి 1981 సెప్టెంబర్ 10వ తేదీన చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. అప్పటికే చంద్రబాబు నాయుడు ఏపీ కాంగ్రెస్ సర్కారులో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ హీరోగా ఉన్నారు. దీంతో వీరి పెళ్లికి పలు రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా స్టార్లు కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
ఇక చంద్రబాబు కట్న కానుకల విషయానికొస్తే చంద్రబాబు కట్నం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నారట. చంద్రబాబు అడిగిన సందర్భం లేదు, ఎన్టీఆర్ ఇచ్చిన సందర్భం కూడా లేదట. కానీ వివాహం మాత్రం చాలా గ్రాండ్ గా జరిగిందని తెలుస్తోంది. చంద్రబాబు స్వయంగా తన పెళ్లికి ఆహ్వానం పలికేందుకు పెళ్లి పత్రిక పసుపు రంగు కార్డు పై పచ్చని రాతతో రాసి ఉన్న కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
READ ALSO : చిరంజీవి మాస్టర్ సినిమాలోని హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?