Advertisement
ఖమ్మం జిల్లా జై తెలుగుదేశం నినాదాలతో మార్మోగింది. సర్దార్ పటేల్ స్టేడియంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తనకు దారిపొడవునా చిన్నారులు సైతం జెండాలతో జేజేలు పలికారని అన్నారు. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుందని.. ఎన్టీఆర్ ఓ వ్యక్తి కాదు.. శక్తి అని తెలిపారు. తెలుగుదేశం హైదరాబాద్ గడ్డ మీదే పుట్టిందని గుర్తు చేశారు.
Advertisement
రాష్ట్రంలో పార్టీ పెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు చంద్రబాబు. ఫుడ్ సెక్యూరిటీ పెట్టారని.. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని.. ఎస్టీ, ఎస్సీ పిల్లల భవిష్యత్ కోసం గురుకులాలు ఏర్పాటు చేశారని.. పేదవాడికి గూడు కోసం పథకం తీసుకొచ్చారని ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ అభివృద్ధికి నాంది పలికారని.. తెలంగాణ అభవృద్ధికి పని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని వివరించారు.
Advertisement
ఐటీ ప్రాధాన్యతను 25 ఏళ్ల క్రితమే గుర్తించానన్నారు. యువత కోసం ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని.. హైదరాబాద్ అభివృద్ధికి నాంది పలికింది తానేనని చెప్పుకొచ్చారు. ఐటీ ప్రాధాన్యం గుర్తించి హైటెక్ సిటీ నిర్మించానని..కంపెనీలు తీసుకొచ్చేందుకు ప్రపంచమంతా తిరిగానన్నారు. 2000 సంవత్సరంలోనే జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. భవిష్యత్తు బయోటెక్నాలజీదేనని గుర్తించి ఆరోజే దానికి నాంది పలికామన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి టీడీపీ దోహదపడిందని చెప్పారు.
తెలంగాణలో రైతులకు గిట్టుబాటు ధరలు రావట్లేదన్న చంద్రబాబు.. పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తే వారి జీవితాలు మెరుగుపడతాయన్నారు.రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పాలసీలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చుపెట్టి వారు ఆర్థికంగా ఎదిగేందుకు కృషిచేయాలని సూచించారు. 20 ఏళ్ల క్రితం వరదలు వస్తే భద్రాచలం మునిగే పరిస్థితి ఉండేదని.. కానీ, మునిగిపోకుండా కరకట్టలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ కు గుర్తింపు రావాలని నాడు కృషిచేశానన్నారు. దేశానికి అత్యున్నత బిజినెస్ స్కూల్ సాధించాననే తృప్తి తనకు ఉందని చెప్పుకొచ్చారు చంద్రబాబు.