Advertisement
రాహుల్ ద్రవిడ్ ప్లేయర్ గానే కాకుండా టీమ్ ఇండియాకు కోచ్ గా కూడా వ్యవహరించారు. అంతేకాక ఎన్నో విజయాలను కూడా సాధించారు. భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. ప్రస్తుతం భారత జట్టుకు గౌతమ్ గంభీర్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే గంభీర్ కూడా విజయాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పవచ్చు. వీరి గురించి కొన్ని అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత క్రికెట్ జట్టు స్టార్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 వరల్డ్ కప్ విజేత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు ప్రస్తుతం కోచ్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ పద్ధతుల గురించి మాట్లాడుతూ వీరి మధ్య ఉన్న తేడాలను వివరించాడు.
Advertisement
Advertisement
తాజాగా ఒక యూట్యూబ్ వీడియోలో రవిచంద్రన్ అశ్విన్ భారత క్రికెట్ లెజెండ్ల గురించి తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ ఈ విధంగా కామెంట్స్ చేశాడు. గౌతమ్ గంభీర్ భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కంటే స్పాంటేనియస్ అంతేకాక అతని పని శైలి చాలా క్రమశిక్షణతో ఉంటుంది అని చెప్పాడు. ద్రావిడ్ నవంబర్ 2021 నుండి భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించడం జరిగింది.
Also read:
అయితే ఈ ఏడాది జూలై లో భారత జట్టు ప్రధాన కోచ్ గా పదవీకాలం ముగిసింది. దాంతో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. అశ్విన్ మాట్లాడుతూ ఈ విధంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. గంభీర్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు, డ్రెస్సింగ్ రూమ్ లో ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది. అయితే గంభీర్ కంటే ద్రవిడ్ శైలి చాలా కఠినంగా ఉంటుంది, క్రమబద్ధంగా ఉంటుంది అని తెలియజేశాడు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!