Advertisement
Chia Seeds in Telugu: చియా సీడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ సీడ్స్ ని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలని పొందవచ్చు. వీటిని మనం సలాడ్స్ లేదంటే ఏమైనా డ్రింక్స్ వంటి వాటిలో మిక్స్ చేసుకోవచ్చు. వీటిని తీసుకుంటే అద్భుతమైన లాభాలు ని పొందడానికి అవుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అలానే చియా సీడ్స్ ని తీసుకోవడం వలన ఇతర లాభాలు కూడా ఉంటాయి. ఆ వివరాలు ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. చియా సీడ్స్ ని తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోజు ఈ గింజల్ని తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. శరీర అవయవాల వాపు కూడా ఈ గింజలతో తగ్గుతుంది.
Advertisement
చియా సీడ్స్ అంటే ఏమిటి?
చియా సీడ్స్ మట్టి రంగులో ఉంటాయి. మరియు అండాకారం కలిగి ఉంటాయి చాల మంది వీటిని తులసి గింజలుగా అనుకుంటారు కానీ ఇవి వేరు, చియా అనేది మెక్సికోలో కనిపించే పుదీనా కుటుంబానికి చెందిన మెక్సికన్ మింట్. చియా గింజలు మొట్టమొదట అజ్టెక్ తెగలచే సాగు చేయబడ్డాయి, వీరు ఆధునిక మెక్సికో మరియు గ్వాటెమాల చుట్టూ ఉంటారు, చియా నిజానికి, వాటికీ ఆ పేరు బలం అని అర్ధం చియా గింజలు ఆకలిని అదుపులో ఉంచేందుకు బాగా ఉపయోగపడుతుంది.
Advertisement
Chia Seeds uses and Benefits in Telugu
హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. శరీరానికి ఈ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. చియా సీడ్స్ ని తీసుకుంటే జుట్టు కూడా బాగుంటుంది మెరిసిపోతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. చియా సీడ్స్ ని తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. చియా సీడ్స్ లో క్యాల్షియంతో పాటుగా ప్రోటీన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళు క్యాల్షియంని పొందడానికి చియా సీడ్స్ ని తీసుకోవడం మంచిది. పోషకాలు ఈ గింజల్లో ఎక్కువ ఉంటాయి. అలానే తక్కువ బరువు ఉండాలనుకునే వాళ్ళు చియా సీడ్స్ ని తీసుకోవడం మంచిది.
Uses
బరువు తగ్గడానికి గింజలు బాగా ఉపయోగపడతాయి ఈ గింజల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ గింజల్ని తీసుకోవడం వలన ఆకలి వేయదు ఆకలి బాగా తగ్గుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు చియా సీడ్స్ ని తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది ఈ గింజల ని తీసుకుంటే చర్మం యువి కిరణాల వలన ఇబ్బంది పడకుండా ఉంటుంది. చర్మాన్ని రక్షించుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇలా చియా సీడ్స్ తీసుకుంటే మనం ఇన్ని లాభాలని పొందవచ్చు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు చర్మం జుట్టు కూడా బాగుంటాయి.
Read Also: