Advertisement
Chiranjeevi Daughter Srija: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొనిదెల సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకపోయినా చాలామందికి తెలుసు. శ్రీజ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతే కాకుండా ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేస్తున్నారని తనకు తన భర్తకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ మెట్లు సైతం ఎక్కారు. వీరిద్దరికి ఓ కుమార్తె ఉండగా, కొంతకాలం తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం పాటు శ్రీజ ఒంటరిగానే ఉన్నారు.
Advertisement
ఈ క్రమంలో చిరంజీవి కళ్యాణదేవ్ అనే వ్యక్తితో శ్రీజ వివాహం జరిపించారు. ఆ తర్వాత కళ్యాణ దేవ్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కకు పెడితే, తాజాగా శ్రీజ కొనిదెల సంచలన పోస్ట్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా గతేడాది జరిగిన మూమెంట్స్ ని షేర్ చేస్తూ, “డియర్ 2022, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేశావు.
Advertisement
Chiranjeevi Daughter Srija
Chiranjeevi Daughter Srija
నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమిస్తూ, కేరింగ్ గా చూసుకునేవాడు, కష్టసుఖాల్లో నాకు తోడుండే వ్యక్తి, ఎప్పుడూ నాకు సపోర్ట్ గా నిలబడేవాడు, తనను కలవడం అద్భుతం. కొత్త ప్రయాణం మొదలవుతుంది” అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఇక ఈ మధ్యకాలంలో శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. రీసెంట్ గా కూతురు బర్త్డేని సైతం శ్రీజ ఒక్కతే సెలబ్రేట్ చేసింది. ఈ క్రమంలో ‘కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న’ అంటూ శ్రీజ వెల్లడించడం అటు మెగా అభిమానులతో పాటు నెటిజన్లలోను ఆసక్తికరంగా మారింది.