Advertisement
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తే, సోను సూద్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచి ఫ్లాపు టాక్ ను మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సగం వసూళ్లను కూడా రాబట్టలేక బొక్క బోర్లా పడింది. ఈ సినిమా వల్ల భారీ నష్టాలు వాటిల్లాయి. అయితే తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
READ ALSO : కమల్ హాసన్ నుంచి ప్రభాస్ : 2022లో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 10 హీరోలు !
“మేము నటించిన ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే దాని పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. ‘ఆచార్య’ ప్లాప్ అయినందుకు నేను ఏమీ బాధపడలేదు. ఆ సినిమా పరాజయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను, చరణ్ 80% పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ కంటే ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ ని చరణ్ ఎక్కువగా ఆస్వాదిస్తున్నాడు” అని అన్నారు.
Advertisement
దర్శకుడు బాబి తో చేస్తున్న సినిమా గురించి మాట్లాడారు చిరు. “ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలన్నీ వచ్చే ఏడాది వేసవికాలం నాటికి విడుదలవుతాయి. మార్చి నుంచి కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తా. బాబీ సినిమాలో ఉన్న రోల్ ఫుల్ మాస్ లుక్ లో ఉంటుంది. సంభాషణలన్నీ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు. ఇక ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ని దీపావళి రోజున విడుదల చేస్తాం” అని చెప్పారు. కాగా ఇటీవల విడుదలైన ‘గాడ్ ఫాదర్’ థియేటర్లలో చాలా విజయవంతంగా కొనసాగుతోంది. ‘ఆచార్య’ తరహాలో కాకుండా మంచి ఫలితాలను రాబడుతోంది గాడ్ ఫాదర్ మూవీ.
Read also : మోడీ టార్గెట్ గా కేటీఆర్ సంచలన ట్వీట్ !