Advertisement
చిరంజీవి ఇప్పుడైతే యాడ్స్ తగ్గించేశారు. కానీ ఒకప్పుడు మాత్రం ఆయన యాడ్ వరల్డ్ కింగ్ గా ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్ళకముందు సినిమాలతో పాటుగా కమర్షియల్ యాడ్స్ ని కూడా చేశారు. కానీ రాజకీయాల్లోకి వెళ్లే ముందు మాత్రం వాటిని పక్కన పెట్టేశారు. తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు యాడ్ వరల్డ్ లో చిరంజీవి స్థానాన్ని రీప్లేస్ చేశారు. రీ ఎంట్రీ తర్వాత మంచి జోష్ మీద సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి రికార్డ్స్ మీద రికార్డ్స్ ని బద్దలు కొడుతూ ఉన్నర్రు. చిరంజీవి ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి పోటీని ఇస్తున్నారు.
Advertisement
మూడుసార్లు 100 కోట్ల రూపాయల షేర్ ని కొల్లగొట్టి సంచలనాన్ని సృష్టించారు. రీసెంట్ గా కంట్రీ డిలైట్ మిల్క్ యాడ్‌లో నటించారు. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ని ఈ యాడ్ లో చూడొచ్చు. కమీడియన్ సత్య కూడా నటించారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ కమర్షియల్ యాడ్ కి దర్శకత్వం వహించారు. కంట్రీ డిలైట్ ని ఎక్కువగా సిటీస్‌లో వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఒక కులానికి చెందిన వారికి మొదటి నుంచి చిరంజీవి అంటే ఇష్టం లేదన్న విషయం తెలిసిందే.
Advertisement
Also read:
అప్పట్లో ఆయన థమ్స్ అప్ యాడ్ చేసాడని ఒక కుల వర్గానికి చెందిన వాళ్ళు ఆ పానీయాన్ని తాగడమే మానేశారు. ఈ యాప్ ని ప్రమోట్ చేస్తుండడంతో ఈ వర్గానికి చెందిన కొంతమంది ఇక నుంచి మేము ఈ పాలను తాగమంటూ కామెంట్స్ పెడుతున్నారు. అది నిజంగా మంచి పరిణామం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తరతరాలుగా కులాహంకారంతో మెలిగే కొంతమంది మూర్ఖులు ఎంత చెప్పినా వినరు. వారిని పట్టించుకోవడం మానేయడం మంచిదని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి