Advertisement
ఏపీలో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన గట్టి ప్రయత్నాల్లో ఉన్నాయి. ఓవైపు లోకేష్ పాదయాత్ర చేపట్టారు. ఇంకోవైపు పవన్ బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు. అయితే.. టీడీపీ, జనసేన కలిస్తే తిరుగుండదనే వాదన ఉంది. కానీ, పొత్తుల విషయంలో ఏదీ తేలడం లేదు. బీజేపీ మాత్రం పవన్ తమతోనే ఉన్నారని అంటోంది. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయని విమర్శిస్తోంది. ఎవరు ఎవరితో కలిసున్నారో పెద్ద కన్ఫ్యూజనే ఉంది. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, జనసేన పొత్తుపై తెగ ప్రచారం చేస్తోంది. దాంతో కాస్త నెగెటివిటీ ఎక్కువగా వినిపిస్తోంది.
Advertisement
తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం ఈ సాయం అందించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు నచ్చరు.. ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమేనిన అన్నారు. తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయని.. పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాయని విమర్శించారు.
Advertisement
అర్హతలేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని.. విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని అన్నారు జగన్. కుటుంబం, రాజకీయ, మానవతా విలువలు లేని వారితో ఈ యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వంలో కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చామని.. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని.. 45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించామని వివరించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నామన్న ఆయన.. వసతి ఖర్చులు కూడా ఇస్తున్నామని చెప్పారు.
రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పిన జగన్.. ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తామన్నారు. పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టామని తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని.. ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే దానితోనే సాధ్యమౌతుందని చెప్పారు. ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు. దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవని గుర్తు చేశారు జగన్.