Advertisement
ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు ఉన్నట్లుండి ఎంగేజ్మెంట్ ని అన్నౌన్స్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసారు. ఆ తరువాతే పెళ్లి తేదీలు కూడా చెప్పేసి ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుని వచ్చారు. మెగా ఫ్యామిలీ అంతా ఇటలీలో సందడిగా గడిపిన సంగతి తెలిసిందే. కొందరు సన్నిహితులు కూడా ఈ పెళ్ళికి హాజరు అయ్యారు. అందరు కలిసి సందడిగా ఎంజాయ్ చేసారు.
Advertisement
మెగా ఫ్యామిలీలో కోడళ్ళు సురేఖ, ఉపాసన, లావణ్య ల గురించి సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతోంది. ఈ ముగ్గురు మధ్య ఉన్న కామన్ పాయింట్స్ గురించి చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ వార్తల సారాంశం ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఎవరికైనా అవసరం అయినప్పుడు.. సహాయం చేయడంలో ముందు ఉంటారు. అలాగే.. రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె నేచర్, ఇతరులకు సాయం చేసే స్వభావం వల్లే రామ్ చరణ్ అభిమానులకు మరింత దగ్గరైంది.
Advertisement
ఇక వీరిద్దరిలో ఉన్న క్వాలిటీనే మెగా ఫ్యామిలీ కోడలు లావణ్యకి కూడా ఉంది. అదే ఇతరులకి సాయం చేయడం. లావణ్య కూడా తనకి వచ్చే సంపాదనలో యాభై శాతం ఇతరుల కోసమే ఖర్చు చేస్తుందట. ఇతరులకు సాయం చేసినట్లు ఆమె ఎవ్వరికీ చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరట. ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఈ ముగ్గురు కోడళ్లలో ఉన్న కామన్ పాయింట్. దీని గురించి నెటిజన్స్ అందరు ప్రశంసిస్తున్నారు.
Read More:
పాములు కాటు వేసే ముందు హెచ్చరిస్తాయా? అలాంటప్పుడు ఏమి చెయ్యాలో తెలుసా?
అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “తండేల్” సినిమా టైటిల్ కి అర్ధం ఏంటో తెలుసా?
హాయ్ నాన్న సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసిందోచ్.. వారు ఏమన్నారంటే?