Advertisement
ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. వారిద్దరూ ప్రేమికులు. ఏడాది నుంచి వారి ప్రేమ కొనసాగుతుంది. వారి ప్రేమను పెద్ద వాళ్లకు చెబితే వారు ఒప్పుకోలేదు. ఆ యువతి మాత్రం తాను ప్రేమించిన యువకుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. దీంతో తమ ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారిని యువతి కుటుంబ సభ్యులు చంపేస్తారనే భయంతో ఎస్పీ వద్దకు వచ్చారు.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా బాడియాల్ గ్రామానికి చెందిన దేవప్ప, నరసమ్మ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు దూరపు బంధువులు. బెంగళూరులో దేవప్ప కూలీ పనులు చేసుకుంటుండా.. ఇంటి పనులు చేసుకునే నరసమ్మ ఏడాది నుంచి టచ్ లో ఉన్నారు. వీరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే విషయం కొద్ది రోజుల కిందటే యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. వీరు బంధువులు అయినప్పటికీ.. యువకుడిది నిరుపేద కుటుంబం కావడంతో యువతి కుటుంబం పెళ్లికి నిరాకరించింది. యువకుడికి జరిమానా విధించి మా ఇంటికి రావద్దని హెచ్చరించారు. ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు కూడా ప్లాన్ చేశారు.
Advertisement
అయితే యువతి మాత్రం తాను ప్రేమించిన దేవప్పతోనే పెళ్లి జరగాలని.. అతనితో జీవిస్తానని మొండికేస్తుంది. ఇంట్లోవారితో గొడవలు రావడంతో ఎవ్వరికీ తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి ఆ యువకుడి వద్దకు చేరింది. మరోవైపు గొర్రెల విషయంలో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. తమ కుమార్తెను శత్రు కుటుంబానికి చెందిన యువకుడికి పెళ్లి చేయబోమని బాలిక తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా ప్రాణభయంగా తిరుగుతున్నారు. మరోవైపు యువకుడి కుటుంబ సభ్యులు ఊరు విడిచి వెళ్లారు. ఈ ప్రేమికులు భయపడి యాదగిరి ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమకు రక్షణ కల్పించాలని కోరారు. మేము ప్రేమించుకుంటున్నాం.. పెళ్లి కూడా చేసుకుంటాం. మా తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని యువతి ఎస్పీ ముందు మొరపెట్టుకోవడంతో పోలీసులు రక్షణ కల్పిస్తామని హామి ఇచ్చారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
YS. జగన్ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫొటోస్..!!
ప్రామిసరీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి ఫాలో కాకపోతే ఆ నోట్ చెల్లదు..!!