Advertisement
రేవంత్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సులు ఇంతకు ముందు కంటే మరింత రద్దీతో రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇదివరకు బానే ఉన్నా మహిళలకు ఉచిత ప్రయాణం కండక్టర్లకు మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తుందని ఆరోపణలు వినపడుతున్నాయి. కొందరు కండక్టర్లు తెలివిగా పురుషులు తీసుకునే టికెట్ ని కూడా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ టికెట్ ఇస్తూ డబ్బులు కాజేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Advertisement
ఇదేంటని ప్రయాణికులు అడుగుతుంటే పొరపాటున ఇచ్చానని ఆ టికెట్ చించి ఇంకో టికెట్ ఇస్తున్నారు. ఎవరూ అడగకపోతే ఆ డబ్బులను జేబులో వేసుకుంటున్నారు. తాజాగా ఒక ప్రయాణికుడు జూన్ 26న కొత్తపేట నుంచి సరూర్ నగర్ వరకు బస్సులో వెళ్లారు దీంతో అతనికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చారు. అదే విధంగా మరో ప్రయాణికుడు జులై 7న ఎల్బీ నగర్ నుంచి మన్నెగూడ వెళ్లగా అక్కడ కండక్టర్ జీరో టికెట్ ఇచ్చాడు.
Advertisement
Also read:
ఆగస్టు 4న ఆదివారం మరో ప్రయాణికుడు కి కూడా ఇదే జరిగింది అని ప్రయాణికుడు వాపోయాడు. కండక్టర్లపై వరుసగా వస్తున్న ఆరోపణలను ఆర్టీసీ యూనియన్లు ఖండిస్తున్నాయి. ఎక్కడో ఒక దగ్గర జరిగిన పొరపాటుకు పూర్తిగా ఆర్టీసీ వ్యవస్థకే అంట కట్టడం సరికాదని మండిపడుతున్నాయి. మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఆ డ్రైవర్లు కండక్టర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయాయి. మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం వలన దాడులు చేసిన సంఘటనలు అనేకం. మహిళలకు మాత్రమే జీరో టికెట్ ఇస్తారని పురుషులకు ఇస్తున్నారని ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆర్టీసీ సంఘాలు ఖండించాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!