Advertisement
మెదక్, నిజామాబాద్ , కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి , లోకల్ కాంగ్రెస్ నేతలకు మధ్య ఏమాత్రం సఖ్యత కనిపించడం లేదు.ఈ ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏడుగురు మంత్రులను ఇంచార్జ్ లుగా అపాయింట్ చేసింది. మంత్రులు రంగంలోకి దిగి గెలుపుపై దిశానిర్దేశం చేస్తున్నా..లోకల్ కాంగ్రెస్ నాయకుల నుంచి నరేందర్ రెడ్డికి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లేకపోవడం ఆ పార్టీని రేసులోకి రాలేకపోతోంది.
Advertisement
Advertisement
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీలో లేకపోడం, ఆ పార్టీ గ్రాడ్యుయేట్ సానుభూతిపరులు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.దీంతో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. వరుసగా పలు రాష్ట్రాల్లో అధికారం చేపడుతున్న బీజేపీ.. తెలంగాణలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కైవసం చేసుకొని , రాష్ట్రంలో పార్టీ విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఇక, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా రేసులో నేనున్నానని ప్రధాన పార్టీల అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు. గ్రాడ్యుయేట్ లను నిత్యం కలుస్తుండటం..సోషల్ మీడియా ప్రచారంలో ముందున్నారు. పైగా, భారీగానే హరికృష్ణకు మద్దతు కూడా లభిస్తోంది. మొత్తంగా..ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఎపిసోడ్ లో ప్రధాన పార్టీల అభ్యర్థుల కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది.