Advertisement
ఢిల్లీ మెట్రోలో ఒక జంట సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్స్ కు చిరాకు పుట్టిస్తోంది. ఈ వీడియోలో జంట కూల్ డ్రింక్ ను ఒకరి నోటి నుంచి మరొకరి నోటిలోకి ఊస్తూ ఉండడం కనిపిస్తోంది. ఈ వీడియో ఎప్పుడు తీశారో తెలియదు.. కానీ చాలా వేగంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లపై వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రేమికుడు తన ప్రేయసి నోటిలో కూల్ డ్రింక్ పోసాడు. ఆమె తిరిగి దానిని అతని నోటిలోకి ఊసింది. వారు ఇదే పనిని రిపీట్ చేస్తూ వీడియోను షూట్ చేసారు.
Advertisement
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించే కొంతమంది ప్రయాణీకులు ఈ జంట చేసిన వింతను చూసి షాక్ అవుతున్నారు. ఇది ప్రచార స్టంట్ తప్ప మరేమీ కాదు అని పేర్కొంటున్నారు. కొందరు ఇది కచ్చితంగా ఢిల్లీ మెట్రోలో జరిగి ఉంటుంది అని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరేమో వారు ఇంకా విమల్ ని తినలేదు.. అది మన అదృష్టం అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
Advertisement
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) వీడియో గురించి మాట్లాడుతూ.. ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు తోటి ప్రయాణికులు రిపోర్ట్ చేయాలనీ సూచించారు. మేము సోషల్ మీడియా ద్వారా అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నాము మరియు మేము కూడా ప్రయాణీకులకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే..” ఇలాంటి సంఘటనలు గమనించినప్పుడు వెంటనే DMRC కి రిపోర్ట్ చేయాలి” అని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా అనేక వీడియోలు లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వివాదాస్పద స్వభావం కారణంగా నెటిజన్లలో వైరల్ అయ్యాయి. జంట మేకింగ్ నుండి డ్యాన్స్ వీడియోల నుండి ప్రయాణంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం వరకు గతంలో చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇతర ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించే అటువంటి చర్యలను అడ్డుకోవడానికి DMRC తన ప్రయత్నాలు తాను చేస్తోంది.
మరిన్ని..
బండారుపై ఫైర్ అవుతున్న నటి మీనా.. ఆ హక్కు ఎవరిచ్చారు అంటూ?
మీ ఋతుచక్రాన్ని వాయిదా వేయడానికి ఈ మందులు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!