Advertisement
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను, తీరం దాటింది. ఈ తుఫాను కారణంగా ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఈ తుఫానుకి ఫణి అనే పేరు ఎలా వచ్చింది. దానికి ఆ పేరు ఎవరు పెట్టారు? అసలు తుఫాన్లకు పేర్లు ఏంటి? ఈ సందేహాలు మీకు కూడా కలిగాయా? ఒక్క ఫణి తుఫాను మాత్రమే కాదు, ఇటీవల వచ్చిన పెథాయ్,హుద్ హుద్ ఇలా అన్ని తుఫాన్లకు ఒక్కో పేరు ఉంటుంది.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
వీటికి పేరు పెట్టడానికి ప్రత్యేకంగా ఓ సంస్థ పనిచేస్తుందన్న విషయం మీకు తెలుసా? మీరు చదివింది నిజమే, దక్షిణాసియా, మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి ప్రారంభమైంది. అంతకుముందు హిందూ, బంగాళాఖాతం, అరేబియా లో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు. కానీ, అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చే తుఫాన్లకు మాత్రం 1953వ సంవత్సరం నుంచి పేర్లు పెట్టే సాంప్రదాయం ఉంది. తుఫాన్లకు పేరు పెట్టకపోతే వాటి గురించి వార్తల్లో రాయాలన్న, చర్చించాలన్న ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ప్రజలను అప్రమత్తం చేయడానికి కూడా సమస్యలు తలెత్తేవి.
Advertisement
అందుకే, తుఫాన్లకు పేర్లు పెట్టాలని పలు దేశాలు నిర్ణయించాయి. 2004లో డబ్ల్యూఎంఓ (ప్రపంచ వాతావరణ సంస్థ) ఆధ్వర్యంలో హిందూ బంగాళాఖాతం అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశం అయ్యాయి. ఆ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్ పాల్గొని ఒక్కో దేశం ఎనిమిది పేర్లను సూచించాయి. మొత్తం ఎనిమిది దేశాలు తలో ఎనిమిది పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించారు. ఆ పేర్లలో ఇప్పటివరకు 56 పేర్లను వాడేశారు. మిగిలిన పేర్లు కూడా అయిపోతే, మళ్లీ ఈ దేశాలన్నీ సమావేశమై మరికొన్ని పేర్లను తయారు చేస్తాయి.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!