Advertisement
ఒక ఖైదీని ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. అయితే అందులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. డబ్బు ఉంటే చాలు జైల్లో కూడా లగ్జరీగా బతకచ్చని అర్ధమవుతోంది. డబ్బు ఇస్తే జైలు అధికారులే నచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి సమకూరుస్తారట. ఇటీవల హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆయనకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఏదో పిక్నిక్ కి వచ్చినట్లు విలాసవంతమైన లైఫ్ ని గడిపారు. జైలులో ఆయన ఎలా ఉన్నాడనే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఖైదీలకు జైలులో ఇలాంటి వసతులు ఉంటాయా అని అందరూ అడుగుతున్నారు. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆగష్ 29 ఉదయం 4 గంటలకు బళ్ళారి లోని కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకు ముందు రోజు డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ కుమార్, సూపరిమినెంట్ డాక్టర్ శోభారాణి, బళ్లారి జైలు సూపరిండెంట్ లతా దర్శన్ తరలింపు పై సమావేశాన్ని నిర్వహించారు. ఇన్ని రోజులు స్పెషల్ ట్రీట్మెంట్ అందుకున్న ఆయనకు బళ్లారి జైల్లో ఆ సౌకర్యాలు అందట్లేదని తెలుస్తోంది. సౌకర్యాలు లేని గదిలో ఉంచారని దర్శన్ చెప్పారు. ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలు తన వెంట తెచ్చుకున్నానని వాటిలో లలితా సహస్రనామ శ్లోకం ఒకటి.
Advertisement
Also read:
అది అతను చదివి ఉండవచ్చు అని జైలు అధికారి తెలిపారు. దర్శన్ బస చేసే ఔటర్ సెక్యూర్ స్పెషల్ సెక్యూరిటీ రూమ్ 10X6 అడుగుల విస్తీర్ణంలో బాత్రూం ఉంది. జైలు మెనూ ప్రకారం ఉదయం పప్పు, మధ్యాహ్నం అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. సాయంత్రం చికెన్ ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. ఖైదీలకు 200 గ్రాములు చికెన్, 90 గ్రాములు మటన్ కామన్ గా ఇస్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!