Advertisement
మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకున్న ఏడు రోజులలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి ప్రత్యేకతను బట్టి మనం వివిధ పనులు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా హిందూ మతం ప్రకారం సోమవారం శివుని వారముగా, మంగళవారాన్ని ఆంజనేయ స్వామి వారముగా, బుధవారాన్ని సుబ్రహ్మణ్య స్వామివారంగా, గురువారాన్ని మహావిష్ణువు వరంగా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి వారాలుగా తీసుకుంటారు. ఈ ప్రత్యేక వారాలలోనే ఆ దేవుళ్లను పూజిస్తారు.
Advertisement
also read:Ravanasura Movie Dialogues in Telugu and English: రావణాసుర డైలాగ్స్ !
ఇందులో ముఖ్యంగా గురువారం రోజు శ్రీమహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవికి పూజించడం వల్ల బురాస్పతి వారి జీవితంలో బలంగా ఉంటాయని ప్రజలు నమ్ముతారు. ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలంగా ఉంటారో వారు అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతారు. గురువారం రోజున కొన్ని వస్తువులను బీరువాలో పెట్టడం వల్ల ధనలక్ష్మి వరం లభిస్తుందని పండితులు అంటున్నారు.
Advertisement
also read: నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ మార్పు వార్తల్ని ఖండించిన కోమటిరెడ్డి
ముఖ్యంగా గురువారం రోజున సాయిబాబాకు కానీ మహా విష్ణువు కానీ పూజ చేస్తారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులంటున్నారు.. ఒక కొబ్బరికాయను తీసుకొని గురువారం రోజు శివాలయానికి వెళ్లి కొబ్బరికాయని శివలింగానికి తాకించి మనసులో ఉన్న కోరికలను కోరుకొని తర్వాత కొబ్బరికాయని ఇంటికి తీసుకెళ్లి భద్రంగా పెట్టాలని పండితులు అంటున్నారు.
also read:Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 06.04.2023