Advertisement
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ప్రత్యేక అభిమానం. స్వయంకృషితో సినిమాలలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టుతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. నటనలోనే కాదు డాన్స్ లో కూడా మెగాస్టార్ స్టైల్ వేరు. మెగాస్టార్ నటన, డాన్స్, ఫైట్స్ చూసి మురిసిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే చిరంజీవిపై కోపంతో అక్కినేని నాగేశ్వరరావు తన కుమారుడు నాగార్జునని హీరో చేశారని అంటారు. చిరంజీవి డేట్స్ దొరకకపోవడం వల్ల విసుగు చెందిన ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో విక్రమ్ మూవీ తో నాగార్జున ని హీరోగా పరిచయం చేశారని డైరెక్టర్ గీతాకృష్ణ తెలియజేశారు.
Advertisement
Advertisement
అనంతరం మజ్ను, సంకీర్తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు నాగార్జున. సంకీర్తన సినిమాకి గీత కృష్ణ దర్శకుడిగా వ్యవహరించారు. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో సెలబ్రిటీల గురించి.. ఒకప్పుడు జరిగిన విషయాల గురించి ఫ్యాక్స్ చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు గీతాకృష్ణ. ఈ క్రమంలోనే నాగార్జునను హీరోగా తీసుకురావడం వెనుక పెద్ద కథ ఉంది అంటూ చెప్పుకోచ్చారు.
“నాగార్జున నటించిన సంకీర్తన సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కింది. అయితే అంతకుముందు అన్నపూర్ణ స్టూడియోస్ చిరంజీవి డేట్ ల కోసం ఎదురు చూస్తూ దాదాపు మూడేళ్ల నుంచి అతని చుట్టూ తిరుగుతూ ఉంది. మెగాస్టార్ డేట్ లు మాత్రం దొరకలేదు. దీంతో నాగేశ్వరరావు కి కోపం వచ్చింది. ఎవరినో ఎందుకు అని భావించి ఏకంగా నాగార్జునను విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయం చేశారు. చిరంజీవి కోసం ఎదురుచూసి విసిగిపోయిన నాగేశ్వరరావు నాగార్జునను తన బ్యానర్ లో హీరోగా పరిచయం చేశారు. ఆ తరువాత సంకీర్తన చిత్రం తెరకెక్కింది” అని చిరంజీవిపై కోపంతో నాగార్జునను నాగేశ్వరరావు హీరోగా పరిచయం చేశారని చెప్పుకొచ్చారు.
Read also: ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ చేసారు రాజమౌళి సర్ ! ఈ సీన్ లో ఉన్న మిస్టేక్ గమనించారా ?