Advertisement
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27న చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్నకు మొదటి రోజే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఆయనను చిత్తూరులోని ఓ ఆసుపత్రికి తరలించి.. ఆ తరువాత అక్కడినుండి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటి నుంచి కూడా తారకరత్న హెల్త్ కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. 23 రోజులుగా ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతూ తాజాగా శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు తారకరత్న.
Advertisement
Read also: CHIRANJEEVI : ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్
23 రోజులుగా ప్రాణాలతో పోరాడిన నందమూరి తారకరత్న ఇలా తుది శ్వాస విడవడంతో నందమూరి కుటుంబంతోపాటు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే విదేశాల నుంచి స్పెషలిస్ట్ లను సైతం పిలిపించి మెరుగైన వైద్యను అందించినప్పటికీ తారకరత్న కన్నుమూశాడని తెలియడంతో ఆయన అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే తారకరత్నని బతికించుకోలేకపోవడానికి మొదటి రోజు తప్పే కారణమా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సహజంగా హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి సిపిఆర్ అనేది నిమిషాలలోనే చేయాలి. కానీ తారకరత్న విషయంలో సిపిఆర్ చేయడానికి దాదాపు 45 నిమిషాల సమయం ఆలస్యం చేశారు.
Advertisement
సిపిఆర్ అందాల్సిన సమయంలో కాకుండా లేటుగా చేశారు. దీంతో హార్ట్ హోల్డ్ లో బ్లడ్ క్లోట్ అయిపోవడంతో బ్రెయిన్ కి సప్లై అయిపోవడం వల్లనే తారకరత్న పరిస్థితి ఇంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఒకవేళ సరైన సమయంలో సిపిఆర్ చేసి ఉంటే తారకరత్న పరిస్థితి ముందునుండే ఇంత సీరియస్ గా ఉండేది కాదేమో? మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్స్ కి మరింత ఎక్కువ అవకాశాలు ఉండేవేమో? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తారకరత్న ఎమ్మెల్యే కావాలనే కోరిక తీరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లడం చాలా బాధాకరమైన విషయం అనే చెప్పవచ్చు.
Read also: జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?