Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ని స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తాజాగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తొలుత విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు రిమాండ్ కి పంపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనక ఇప్పుడు రెండు సెక్షన్లు కీలక పాత్ర పోషించాయి. వీటితోనే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఓ ట్వీట్ చేశారు.
Advertisement
చంద్రబాబును రిమాండ్ కి పంపాలని సిఐడి చేసిన విజ్ఞప్తిని విజయవాడ ఏసిబి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు ఆమోదించారు. దీంతో చంద్రబాబును రెండు వారాలపాటు రిమాండ్ కి పంపుతూ తీర్పు ఇచ్చారు. అయితే కోర్టులో విచారణ సందర్భంగా.. ఇందులో సీఆర్పీసీ లోని రెండు కీలక సెక్షన్ల పై తీవ్రవాదోపవాదాలు కొనసాగాయి. ఇందులో ఒకటి సెక్షన్ 409 కాగా.. మరొకటి సెక్షన్ 17 ఏ. 409 లో ఆస్తి బదలాయింపునకు సంబంధించి లేదా నిధుల బదలాయింపులకు సంబంధించినది కాగా.. మరో సెక్షన్ 17 ఏ అవినీతి కేసులో గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయొచ్చా లేదా అన్నది. ఈ రెండు సెక్షన్లు చంద్రబాబుకు అన్వయిస్తూ సిఐడి ఇచ్చిన రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టు ఆమోదించింది. ఇందులో సెక్షన్ 17 ఏ ప్రకారం.. గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాలని నిబంధనను చంద్రబాబు లాయర్ సిద్దార్థ్ లూద్రా తెరపైకి తీసుకొచ్చారు.
Advertisement
సిఐడి మాత్రం అవసరం లేదని వాదించింది. గతంలో అచ్చన్నాయుడు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి ప్రస్తావించారు. ఏసీబీ కోర్టు తీర్పులో మాత్రం సుప్రీంకోర్టు గతంలో ఈ తీర్పు ఇచ్చినట్టు రాసినట్టు తెలుస్తోంది. దీనిపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు. చంద్రబాబు కేసులో సెక్షన్ 17 ఏను తప్పుగా అనుభవించినట్టు కనిపిస్తుందని పేర్కొన్నారు. తాజాగా ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీ తో పాటు గతంలో అచ్చం నాయుడు కేసులో హైకోర్టు తీర్పు రఫెల్ కేసులో యశ్వంత్ సింగ్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు భావించి ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించినట్టు ఉందన్నారు. అచ్చన్నాయుడు కేసు తీర్పు ఇచ్చింది హైకోర్టు అని రఫల్ కేసులో సుప్రీంకోర్టు సెక్షన్ 17 ప్రకారం.. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని చెప్పిందన్నారు.
మరో ట్వీట్ లో నాన్ డైలాగులు నేరంలో ఎవరైనా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినప్పుడు నేరవాదులు చేసే మొదటి పని సంబంధిత కోర్టు ముందు బెయిల్ కోసం దరఖాస్తు చేయడమే అన్నారు పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ దరఖాస్తును అరెస్ట్ అయిన వ్యక్తి కలిసి దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును కోర్టు విచారిస్తుందన్నారు అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసు లేదా జ్యుడీషియల్ కష్టానికి రిమాండ్ చేయడం లేదా బెయిల్ మంజూరు చేయడం వంటి తగిన ఉత్తర్వులను జారీ చేస్తుందన్నారు చంద్రబాబు లాయర్లు ఆ పని చేయకుండా రిమాండ్ ని వ్యతిరేకించడానికి పరిమితం అయ్యారని పేర్కొన్నారు అందుకే చంద్రబాబు జైలుకు వెళ్లారని చెప్పారు నాగేశ్వరరావ.
- మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !