Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే దేశంలోని కొన్ని ఇండస్ట్రీల వారు కాస్త చిన్నచూపు చూసేవారు.. అలాంటి ఇండస్ట్రీని దేశమే కాకుండా ప్రపంచ దేశ సినీ ఇండస్ట్రీలు కూడా గుర్తించదగ్గ రేంజ్ కు తీసుకెళ్లిన ఏకైక డైరెక్టర్ రాజమౌళి అని చెప్పవచ్చు.. ఆయన టాలెంట్ ను వర్ణించడం వర్ణనాతితం.. అలాంటి జక్కన్న కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ప్లాప్ అని చెప్పడం కంటే అసలు ఆయన సినిమా కలెక్షన్ బీట్ చేసిన వారు ఇప్పటివరకు లేరని చెప్పవచ్చు. అలాంటి జక్కన్న బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డైరెక్టర్ గా మారారు. అలాంటి రాజమౌళి 10 సంవత్సరాల వయసులోనే ఓ సినిమాలో నటించాలని చాలామందికి తెలియదు..
Advertisement
Advertisement
ఆ వివరాలు ఏంటో చూద్దాం.. జక్కన్న బాల నటుడుగా నటించిన సినిమా పిల్లనగ్రోవి. 1983లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సజావుగానే జరిగినా కానీ ఏవో కారణాలవల్ల చిత్రం విడుదల కాలేదు. అందుకే ఆయన నటించిన విషయం బయటకు రాలేదు. అసలు రాజమౌళి అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి, డైరెక్టర్ అవ్వకముందు చాలా సీరియల్స్ కు దర్శకుడిగా పని చేశారు.. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ తో సినిమా డైరెక్టర్ గా మారారు.
దాదాపు రెండు దశాబ్దాల కెరియర్ లో 12 చిత్రాలు మాత్రమే చేసిన రాజమౌళి ఎవరు కూడా అందుకోలేని రికార్డు సెట్ చేశారు. బాహుబలి 2 విడుదల ఐదేళ్లు అవుతున్న ఈ చిత్రం కలెక్షన్స్ టచ్ చేసే సినిమా రాలేదు. అంతేకాకుండా నాని హీరోగా నటించిన మజ్ను సినిమాలో కనిపించారు. అలాగే రెయిన్బో అనే చిత్రంలో నటించారు. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటించిన మూవీ డిజాస్టర్ అయింది. ఏదేమైనా ఇండియన్ సినిమా కలలు కన్న వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించి చూపించాడు దర్శకుడు రాజమౌళి.
also read:టీమిండియాపై ఆస్ట్రేలియా వెటకారం..షాకింగ్ రిప్లై ఇచ్చిన ఆకాష్ చోప్రా..!!