Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దగ్గుబాటి వెంకటేష్ మాత్రమే. ఆయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. అందరూ హీరో ల్లాగా ఈయన మాస్ ఇమేజ్ కోసం పరితపించలేదు. తన కెరీర్ ప్రారంభం నుంచి కథకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తూ వచ్చారు. అత్యధిక హిట్ పర్సంటేజ్ హీరో కూడా ఈయనే. వెంకీ ఇప్పటివరకు చాలా రీమేక్ సినిమాలు చేశారు. కానీ ఆ మూవీలు చూస్తే రీమేక్ లాగా కనిపించవు. ఆయన ఒరిజినాలిటీ నటనే కనిపిస్తుంది. మరి వెంకీ చేసిన రీమేక్ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం..
సూర్యవంశం :
Advertisement
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయిన సూర్యవంశం సినిమా ను తమిళ్ నుంచి రిమేక్ చేశారు. కానీ సినిమా చూసిన వారు రీమేక్ అంటే నమ్మరు.
జెమిని :
కోలీవుడ్ ఇండస్ట్రీలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వచ్చింది. అక్కడ యావరేజ్ గా నిలిచింది. కానీ తెలుగులో మాత్రం విక్రమ్ కంటే కాస్త అద్భుతంగా నటించారు వెంకీ.
ఘర్షణ :
కోలీవుడ్లో సూర్య హీరోగా నటించారు. “కాకా కాకా” అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ ని తెలుగులోకి రీమేక్ చేశారు. ఇందులో వెంకటేష్ హీరోగా అద్భుతంగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది.
ఈనాడు :
బాలీవుడ్ లో ఎవెన్స్ డే అనే అనే పేరుతో వచ్చింది. ఇందులో కమల్ హాసన్ వంటి యూనివర్సల్ హీరో ఉన్నప్పటికీ వెంకీ అస్సలు తగ్గలేదు. ఆయన్ను డామినేట్ చేసే విధంగా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో..
గోపాల గోపాల :
Advertisement
బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ మై గాడ్ సినిమాకు ఇది రీమేక్. అక్కడి అక్షయ్ కుమార్ పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ చేశారు. కానీ హిందీ సినిమాతో పోలిస్తే వెంకటేష్ ఈ సినిమాలో గోపాల్ పాత్రకు జీవం పోశారు అని చెప్పవచ్చు.
చంటి :
తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయినా చిన్న తంబి మూవీ కి రీమేక్ ఇది.ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ముందుకు రాలేదు. కానీ వెంకటేష్ మాత్రం ధైర్యంగా రీమేక్ లో నటించడానికి వచ్చి ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు.
సుందరాకాండ:
తమిళ ఇండస్ట్రీ నుంచి రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగులో సుందరకాండ పేరుతో వచ్చింది. సూపర్ హిట్ అయింది.
గురు :
హిందీలో మాధవన్ నటించిన షాలా కాదుస్, తమిళ్ లో ఇరుది సుతృ గా రిమేక్. కాని తెలుగులో గురు పేరుతో వచ్చిన ఈ సినిమా వెంకటేష్ పర్ఫార్మెన్స్ చూసినవారు ఫిదా అయిపోయారు.
దృశ్యం:
మలయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్ నటించిన ఈ సినిమాను, తెలుగులో వెంకటేష్ చేస్తే ఒరిజినల్ కి వ్యాల్యూ పెరిగింది. తెలుగులో సూపర్ హిట్ అయ్యాక కమల్ హాసన్ కూడా ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపారు.
నారప్ప:
వెంకటేష్ కెరియర్ లోనే చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించాడని చెప్పవచ్చు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాపై మరింత ఫోకస్ పెట్టుంటే మూవీ ఎక్కడికో వెళ్ళేదని చెప్పవచ్చు.
ALSO READ;