Advertisement
చాలామంది లాయర్, అడ్వకేట్ రెండు కూడా ఒకటే అని అనుకుంటారు. కానీ నిజానికి రెండు వేరు వేరు. కొన్ని పదాలు చూస్తే ఒకటే అని అనుకుంటూ ఉంటాము. కానీ అది పొరపాటు. చాలామందికి లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య డిఫరెన్స్ తెలియదు. అదేంటో ఇప్పుడు చూసేద్దాం… బైజూస్ ప్రకారం చూసినట్లయితే లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లో ఎల్ఎల్బీ డిగ్రీ తీసుకున్న వాళ్ళని లాయర్ అంటారు.
Advertisement
ఇండియాలో ఒక లాయర్ లేదా న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, ఆ వ్యక్తి స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ని కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎల్బీ డిగ్రీ ఉండి బార్ ఎగ్జామినేషన్ పూర్తి చేస్తే, అడ్వకేట్ అంటారు. అయితే లాయర్లు కేవలం న్యాయపరమైన సలహాలను మాత్రమే ఇస్తారు.
Advertisement
లా గురించి వాళ్ళు చెప్పగలరు. కానీ కోర్టులో ఒక కంప్లైంట్ తరఫున వాళ్లు వాదించడానికి అవ్వదు. అదే అడ్వకేట్ అయితే కోర్టులో ఒక క్లైంట్ తరఫున వాదిస్తారు. కేసును బట్టి క్లైంట్ కి నష్టపరిహారం ఇప్పించడం వంటివి చేస్తారు. అడ్వకేట్ తో పోల్చుకుంటే లాయర్ కి అనుభవం తక్కువ. న్యాయస్థానంలో ఒక క్లైంట్ తరఫున వాదించాలంటే కచ్చితంగా ఎక్స్పీరియన్స్ ముఖ్యం.
అడ్వకేట్ ఎన్నో కేసులుని వాదించి అనుభవాన్ని పొందుతారు. లాయర్ కోర్టు కేసుని వాదించలేరు. లాయర్ కి అనుభవం చాలా తక్కువ. పైగా అడ్వకేట్ తో పోల్చుకుంటే లాయర్ ఫీజు కూడా తక్కువగా ఉంటుంది. అడ్వకేట్ లాయర్ కంటే కొంచెం పట్టు ఎక్కువ ఉండడం వలన ఫీజు కూడా ఎక్కువ తీసుకుంటారు. ఒకవేళ ఇంగ్లాండ్ లో కానీ సౌత్ ఆఫ్రికా, స్కాట్లాండ్ లో చదివి వస్తే వాళ్ళని బారిష్టర్ అని అంటారు. అడ్వకేట్ తో ఇది సమానమే.
Also read: