Advertisement
Director Koratala Siva Wife: రాజమౌళి తర్వాత అంటే స్టార్ ఇమేజ్ కలిగిన దర్శకుడు ఎవరన్నా ఉన్నారా? అంటే, అది కొరటాల శివ అనే చెప్పాలి. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ అనే నాలుగు చిత్రాలు తెరకెక్కించి నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకుని స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు దర్శకుడు కొరటాల. ప్రస్తుతం చిరుతో ‘ఆచార్య’ కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, తన చిత్రాలతో కేవలం హిట్లు కొట్టడం మాత్రమే కాదు, ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేసి ప్రేక్షకులకు మంచి మెసేజ్ కూడా ఇస్తుంటాడు కొరటాల.
Advertisement
ఆయన ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడానికి, ఆయన సక్సెస్ వెనక కారణం తన భార్య అని చాలా సందర్భాల్లో కొరటాల శివ చెప్పుకొచ్చారు. అవును ప్రతి పురుషుని వెనుకా, ఓ స్త్రీ ఉంటుంది కదా. అలాగే కొరటాల శివ వెనుక ఉన్న స్త్రీ మూర్తి ఆయన భార్య అరవిందా. ఇక ఆమె మొదటి నుంచి రామకృష్ణ పరమహంస భక్తురాలు కావడంతో రామకృష్ణుని బోధనలతో విశేషంగా ప్రభావితం అయింది.
Advertisement

Director Koratala Siva Wife
ప్రతి ఆదివారం ఆమె రామకృష్ణ మతానికి వెళ్లి సేవలు అందిస్తుంది. ఇక శ్రీమంతుడు కాన్సెప్ట్ ఆమె ఫిలాసఫీ నుంచి వచ్చిందేనట. అందుకే కోట్లు సంపాదించిన నేటికీ చిన్న అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు ఈ దంపతులు. ఎంత సంపాదించినా అవసరానికి మించి ఉండకూడదని, తినడానికి, బతకడానికి అవసరమైనది ఉంచుకొని మిగిలింది తిరిగి సమాజానికి తిరిగి ఇచ్చేయాలనే సిద్ధాంతం ఆమె ఫాలో అవుతారు. అందుకే సంపాదనలో అధిక భాగం సమాజసేవకే వినియోగిస్తూ ఆత్మతృప్తి పొందుతున్నారట అరవింద. డైరెక్టర్ లైఫ్ కన్నా ఓ మంచి వ్యక్తికి భర్తగా జీవితం చాలా బాగుంటుందని కొరటాల చాలా సందర్భాల్లో భార్య అరవింద గురించి చెప్పటం విశేషం.
READ ALSO : HIT 2 మూవీ తెలుగు డైలాగ్స్




