Advertisement
ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట నోరూరించే మాంసాహార వంటకాలు ఘమఘమలాడుతుంటాయి. చాలామంది ఆదివారం రోజున మాంసాహారంతో గడిపేస్తుంటారు. నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. సూర్యుడు ప్రత్యక్ష దైవం. హిందువులు సూర్య దేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు చెబుతున్నాయి.
Advertisement
Read also: అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోలుగా ఎదిగిన టాలెంటెడ్ హీరోలు వీరే..!!
అందుకే ఆలయాలలో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు. ఉదయం నిద్ర లేవగానే సూర్యుడి నమస్కారం చేయడం, సంధ్యావందనం వంటి వాటి ద్వారా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం హిందూ సాంప్రదాయంలో ఉంది. సూర్యుని రథానికి ఏడు గుర్రాలని, అవి ఏడు రంగుల ఇంద్రధనస్సును సూచిస్తాయని అంటుంటారు. సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది వాస్తవం. మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది. దానివల్ల ఏ విధమైన భగవత్కార్యాలు చేయలేరు. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి.
Advertisement
హిందువులలో కొందరు కొన్ని రోజులలో మాంసాహారం తినరు. సాధారణంగా శనివారం, శుక్రవారం, సోమవారం, మంగళవారం మాంసాహారం నిషిద్ధం. అలాగే కొన్ని పండుగలు, వ్రతాలుించేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఉదాహరణకి సాంబ పురాణంలోని సూర్యాష్టకం లో స్త్రీ, తైల, మధు, మాంసాహారం నిషిద్ధం. ఆదివారం కొన్ని రకాల ఆహారాలను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆదివారం మాంసాహారం తీసుకోకుండా.. ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట. అంతేకాకుండా ఆరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వలన ఎన్నో ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కావాలంటే ఏడు ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు చదవండి. మితాహారం తీసుకోవడం, సూర్యోపాసనం చేయడం వంటివాటివల్ల మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనించవచ్చు.
Read also: వైరల్ గా బాలకృష్ణ పెళ్లి శుభలేఖ